కల్ట్ సినిమాలో చేయనని చెప్పేశాడు

బ్రహ్మానందం భార్యకు స్వయానా మేనల్లుడు అవుతాడంట శేఖర్ కమ్ముల. ఆ చుట్టరికంతోనే రాజా గౌతమ్ తో గోదావరి సినిమా చేసేందుకు ప్రయత్నించాడు కమ్ముల.

ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేతికి వెళ్లడం పరిశ్రమలో సర్వసాధారణం. ఆ లిస్ట్ చెప్పుకుంటే చాంతాడంత అవుతుంది. ఎప్పటికప్పుడు ఈ కోణంలో కొత్త విషయాలు కూడా వెలుగులోకి వస్తుంటాయి. ఇది కూడా అలాంటిదే.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘గోదావరి’. హీరో సుమంత్ కెరీర్ లో అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ కల్ట్ మూవీ ఇది. నిజానికి ఈ సినిమా ఆఫర్ నేరుగా సుమంత్ కు రాలేదు.

‘గోదావరి’ సినిమాలో హీరో పాత్ర కోసం ముందుగా బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ ను అనుకున్నాడు కమ్ముల. అతడి దగ్గరకు వెళ్లి కథ కూడా వినిపించాడు. అయితే సినిమా కథ లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ లా ఉందని భావించి, రాజా గౌతమ్ నో చెప్పాడు.

ఆ తర్వాత ఆ ప్రాజెక్టు సుమంత్ చేతికి వెళ్లడం, సూపర్ హిట్ కొట్టడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడీ విషయాన్ని రాజా గౌతమ్ తండ్రి బ్రహ్మానందం స్వయంగా వెల్లడించారు. అంతేకాదు, శేఖర్ కమ్ముల నేరుగా వచ్చి రాజా గౌతమ్ కు ఈ కథ వినిపించడం వెనక కారణం కూడా చెప్పారు.

బ్రహ్మానందం భార్యకు స్వయానా మేనల్లుడు అవుతాడంట శేఖర్ కమ్ముల. ఆ చుట్టరికంతోనే రాజా గౌతమ్ తో గోదావరి సినిమా చేసేందుకు ప్రయత్నించాడు కమ్ముల. కానీ ఓ మంచి అవకాశాన్ని రాజా గౌతమ్ మిస్ చేసుకున్నాడు.

రియల్ లైఫ్ తండ్రీకొడుకులు బ్రహ్మానందం, రాజా గౌతమ్ కలిసి నటించిన సినిమా ‘బ్రహ్మ ఆనందం’. ఈ సినిమా టీజర్ లాంచ్ లో ఈ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు బ్రహ్మానందం.

3 Replies to “కల్ట్ సినిమాలో చేయనని చెప్పేశాడు”

  1. గొదావరి సినిమా ఎక్కువ working days వల్ల బడ్జెట్ చెయ్యి దాటిపోయి ఫ్లాప్ అయ్యిందని అప్పట్లో నిర్మాతే చెప్పాడు..

    క్లైమాక్స్ లో కథ లేకుందా treasure hunt తో నడిపించడం వల్ల కూడా నష్టం వచ్చిందని అన్నాడు.

    1998 లో తొలి ప్రేమ లాంటి హిట్ కొట్టిన నిర్మాత, 2006 లో గోదావరి, రారాజు (గోపిచంద్) ఫ్లాపులతో ఇంక banner మూసేసాడు

  2. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

Comments are closed.