బ్రేకింగ్ – పుష్ప లో సమంత?

పుష్ప సినిమాకు మరో క్రేజీ పాయింట్ యాడ్ అయింది. ఇప్పటికే చాలా క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమాలో అయిటమ్ సాంగ్ ఒకటి వుంది. దీనికి చాలా పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు ఫిక్స్ అయిన…

పుష్ప సినిమాకు మరో క్రేజీ పాయింట్ యాడ్ అయింది. ఇప్పటికే చాలా క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమాలో అయిటమ్ సాంగ్ ఒకటి వుంది. దీనికి చాలా పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు ఫిక్స్ అయిన పేరు…సమంత. 

అవును,..రంగమ్మ..మంగమ్మా అంటూ రంగస్థలంలో ఆడి, పాడి జనాల్ని ఆకట్టుకున్న సమంత నే పుష్పలో ఐటమ్ సాంగ్ చేయబోతోందని తెలుస్తోంది. 

దర్శకుడు సుకుమార్ అంటే సమంతకు మాంచి గౌరవం వుంది. ఆ గౌరవంతోనే సమంత ఈ ఐటమ్ సాంగ్ కు ఒప్పుకున్నట్లు సమాచారం. 

ప్రస్తుతం సమంత సినిమాలు లైన్లో వున్నాయి కానీ సెట్ మీద లేవు. శాకుంతల సినిమా ఫినిష్ అయిన విడుదలకు రెడీగా వుంది. 

విడాకుల వ్యవహారం తరువాత హుషారుగా సోషల్ మీడియాలో కనిపిస్తున్న సమంత, అదే ఊపుతో ఐటమ్ సాంగ్ చేయబోతోంది.