మెగా కుటుంబ సభ్యుల నడుమ వున్న చిన్న చిన్న మనస్పర్ధలు అన్నీ జస్ట్ ఒక్కసారి అంతా కలిస్తే, మాయం అవుతాయని, నిర్మాత బన్నీవాస్ అన్నారు. మెగా ఫ్యామిలీ సభ్యులు అందరికీ కుటుంబ బంధాల విషయంలో పూర్తి అవగాహన వుందని. అందువల్ల, ఈ చిన్న చిన్న విషయాలు పెద్ద సమస్య కాదు. ఒక్కసారి అంతా కూర్చుంటే ఇట్టే సమసిపోతుందని బన్నీ వాస్ అన్నారు. గీతా సంస్థ నుంచి వస్తున్న ఆయ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా బన్నీ వాస్ ‘గ్రేట్ ఆంధ్ర’తో మాట్లాడారు.
ఆయ్ సినిమా తనకు కమ్ బ్యాక్ అని చెప్పారు. కోవిడ్ టైమ్ లో ఒప్పుకున్న సినిమాలు అన్నీ పూర్తయిపోయాయని, ఆయ్ సినిమాతో కొత్త కంటెంట్ మొదలవుతోందని అన్నారు. ప్రేక్షకుల అభిరుచి మారడం వల్ల తమ సినిమాలు కొన్ని అనుకున్న రేంజ్ లో నడవలేదన్నారు. ఆయ్ సినిమా మాత్రం అవుట్ అండ్ అవుట్ ఫన్ తో నడుస్తుందన్నారు.
అధికార పదవులు తీసుకోవాలని అనుకోవడం లేదని, కేవలం పార్టీ పదవులు అయితే తీసుకుంటానని బన్నీ వాస్ స్పష్టం చేసారు. పూర్తి బాధ్యతతో పని చేయకపోతే పవన్ కళ్యాణ్ తన తాట తీస్తారని బన్నీ వాస్ అన్నారు.
సినిమా రంగంలో శాశ్వత శతృత్వాలు వుండవని, అందువల్ల ఎప్పటికైనా పరుశురామ్ తో సినిమా వుండోచ్చని అన్నారు. బోయపాటి సినిమా బన్నీతోనే వుంటుందన్నారు. బన్నీ తరువాత సినిమా మోస్ట్ లీ త్రివిక్రమ్ తోనే వుంటుదని బన్నీ వాస్ వెల్లడించారు.
జనం పట్టించుకోరు
ఆ పేరుకి అర్ధం ఏమిటి.. ఇంటి పేరు బన్నీ పెట్టిన పేరు వాస్ అనా???