యంగ్ ప్రొడ్యూసర్ ను వీడని నీడలా వెంటాడుతోంది సునీత బోయ అనే మహిళ. దాదాపు మూడేళ్లుగా నడస్తోంది ఈ గడబిడ. తరచు ఫేస్ బుక్ లో పోస్టులు పెడుతుంది. బన్నీ వాస్ ఎక్కడ వున్నాడో తెలిస్తే అక్కడ ప్రత్యక్షం అవుతుంది. మూడేళ్ల క్రితం బన్నీవాస్ మీద పోలీస్ కంప్లయింట్లు కూడా ఇచ్చింది.
సినిమాల్లో అవకాశం ఇస్తానని చెప్పి మోసం చేసారు అన్నది ఆమె అభియోగం. పోలీసులు కేసు విచారణ చేయడం, ఆమెను అరెస్ట్ చేయడం, మెంటల్ ఆసుపత్రిలో చేర్పించడం, ఆమె మందులు వాడడానికి నిరాకరించడం ఇలా రకరకాల వ్యవహారాలు జరిగిపోయాయి.
ఆమె బాధ పడలేక బన్నీవాస్ ఫోన్ వాడడం కూడా మానేసాడని బోగట్టా. ఆమె వల్ల తన భార్యా పిల్లలకు ఏమైనా ప్రమాదం వుంటుందేమో అని బన్నీ వాస్ తీవ్రంగా భయపడుతున్నారని తెలుస్తోంది. అందుకే కట్టుదిట్టమైన గేటెడ్ కమ్యూనిటీకి మారారు కూడా.
అసలు కథ ఏమిటో ఎవరి వెర్షన్ వారిదే తప్ప వివరాలు తెలియవు. ఆమెను, ఆమె వీడీయోలను ఫొటోలను చూసిన వారు, అంత సినిమాటిక్ మెటీరియల్ కాదు అని అంటారు. మరి ఆమె బన్నీ వాస్ కు ఎలా టచ్ లోకి వచ్చిందో? అసలు ఎలా పరిచయమో అన్నది తెలియదు. కానీ ఆమెతో వ్యవహారం బన్నీవాస్ కు నిద్రలేకుండా చేస్తోంది.
వీలయినంత లో ప్రొఫైల్ మెయింటెయిన్ చేసే బన్నీ వాస్ కు ఈ తలనొప్పి జీవితాంతం వీడదేమో? ఎందుకంటే లేటెస్ట్ గా ఆమె ఇప్పుడు మరోసారి గీతా ఆఫీస్ కు వచ్చి ఆత్మహత్యాప్రయత్నం చేసిందని వార్తలు వచ్చాయి.
పోలీసులు సకాలంలో వెళ్లి అరెస్ట్ చేసి,కోర్టులో ప్రవేశపెట్టారు. ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదని కోర్టుకు తెలిపినట్లు తెలుస్తోంది.