పుష్ప 2..ఆన్ కార్డ్స్. పార్ట్ వన్ ఊహించనంత సక్సెస్ అయింది. ఆంధ్రలో బయ్యర్లు నష్టపోయినా, నిర్మాతలు డబ్బులు వెనక్కు ఇచ్చినా, నార్త్ ఇండియాలో అన్ ఎక్స్ పెక్టెడ్ సక్సెస్ అయింది.
అందువల్ల పార్ట్ 2 మీద ప్రామిసింగ్ బజ్ ఏర్పడింది. దీంతో పుష్ప పార్ట్ వన్ మీద రాని లాభాలు తెచ్చుకోవాలి. నష్టాలు పూడ్చుకోవాలని నిర్మాతలు ఆశగా వున్నారు. దర్శకుడు సుకుమార్ స్క్రిప్ట్ చేస్తున్నారు.
కానీ ఈ లోగా మరో గమ్మత్తయిన కార్యక్రమం నడుస్తోందని తెలుస్తోంది. బన్నీ తరువాత సినిమానో, ముందు సినిమానో తెలియదు కానీ, మరో సినిమాకు స్మూత్ గా తెరవెనుక ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. దానికి దర్శకుడు ఎవరు..కథ..కమామిషు..ఇలాంటివి ఏవీ ఇప్పటికిప్పుడే బయటపెట్టేవి కాదు కానీ, కొంత ప్రీ ప్రొడక్షన్ వర్క్ మాత్రం మొదలైనట్లు వార్తలు అందుతున్నాయి.
బన్నీ తరువాత సినిమాను గీతా నిర్మించాల్సి వుంది. గతంలో బోయపాటి దీనికి దర్శకుడు అనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్టు పక్కన వుంది. మరి ఈ ప్రీ ప్రొడక్షన్ ఏ బ్యానర్ లో? ఏ దర్శకుడితో? అన్న వివరాలు అన్నీ త్వరలో బయటకు వస్తాయి.
ఒక వేళ పుష్ప 2 స్క్రిప్ట్ కు టైమ్ పడితే ఈ లోగా బన్నీ మరో సినిమా చేసే ఆలోచనలో వున్నారా? అన్నది కూడా అనుమానంగా వుంది. పుష్ఫ 2 విషయంలో బన్నీ చాలా జాగ్రత్తగా వున్నారు.
బాలీవుడ్ లో బన్నీ స్ధానం సుస్ధిరం కావాలంటే పుష్ప 2 అన్ని విధాలా బాగుండాలి. అందుకే చాలా కేర్ తీసుకుంటారు. చాలా టైమ్ పడుతుంది. అందుకే మరో సినిమా ఆలోచన ఏమన్నా బన్నీ చేస్తున్నారా? అన్నది కూడా అనుమానం గా వుంది.