టాలీవుడ్ మాత్రమే కాదు, ఇతర భాషల సినిమా పరిశ్రమ కూడా సంతాపం వెలిబుచ్చుతోంది. సీనియర్ హీరో కృష్ణం రాజు మృతికి సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి.
సోషల్ మీడియా అక్కౌంట్లు, వాట్సాప్ గ్రూపుల్లో సంతాపాలు హోరెత్తుతున్నాయి. కృష్ణంరాజుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం వున్న ప్రతి ఒక్కరూ సంతాపం వెలిబుచ్చుతున్నారు.
మహేష్, పవన్, చిరు, ఇలా చాలా మంది ఇప్పటికే వెళ్లి కృష్ణం రాజు భౌతిక కాయానికి నివాళులు అర్పించి వచ్చారు. కానీ ఒక్కరంటే ఒక్కరు, అల్లు అర్జున్ మాత్రం తన రూటే సెపరేట్ అనుకుంటున్నారు. కృష్ణం రాజు మరణం వార్త తెలిసిన చాలా సేపటి తరువాత కూడా సైమా అవార్డుల ఫంక్షన్ లో తాను ఇచ్చిన పార్టీ విడియోను బన్నీ షేర్ చేయడం విశేషం.
పోనీ దానికి ముందు అయినా వెనుక అయినా సంతాప సందేశం ప్రకటించారా? అంటే అదీ లేదు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు కనిపిస్తున్నాయి. బన్నీ ఎప్పుడూ అంతే తనదో దారి, తనదో స్టయిల్ అన్నట్లు వుంటారు. తప్ప నలుగురు చేసినట్లు చేయరు.