cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

కరోనా మీద ప్రశాంత్ వర్మ సినిమా

కరోనా మీద ప్రశాంత్ వర్మ సినిమా

వైరస్ లు ప్రబలడం, వాటి మీద ఫిక్షన్ స్టోరీలు అల్లడం కొత్త కాదు. అలాగే సినిమాలు కూడా కొత్త కాదు. అయితే తెలుగులో ఇలాంటివి మాత్రం కొత్త. డిఫరెంట్ సినిమాలు తీసే డైరక్టర్ ప్రశాంత్ వర్మ ఆలోచన ఇప్పడు ఈ థీమ్ మీద పడింది. కరోనా నేపథ్యంలో సినిమా చేయాలని ఆయన ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఆలోచన కరోనా వచ్చిన  తరువాతది కాదని, డిసెంబర్ లోనే ఆయన ఇలాంటి థీమ్ ఒకటి ప్లాన్ చేసారని సన్నిహితులు చెబుతున్నారు. ఓ అప్ కమింగ్ యంగ్ హీరోతో ప్రశాంత్ వర్మ ఈ సినిమా ప్లాన్ చేసారని, ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా అయిపోయిందని తెలుస్తోంది.

ఇప్పటి వరకు రెండు సినిమాలు తీసిన ప్రశాంత వర్మ, ఓ వైవిధ్యమైన దర్శకుడిగా ముద్ర పడ్డారు. ఇప్పడు కరోనా మీద సినిమా తీస్తే, ఆ ముద్ర ను నిలబెట్టుకున్నట్లు అవుతుంది. అందుకే ఆ దిశగా ప్రశాంత్ వర్మ అడుగులు వేస్తున్నట్లు బోగట్టా. ఇలాంటి పానిక్ సినిమాలు హాలీవుడ్ లో కాస్త పకడ్బందీ స్క్రిప్ట్ తో భారీగా రెడీ అవుతాయి. ఇప్పుడు ప్రశాంత్ వర్మ మాత్రం చిన్న హీరోతో డిఫరెంట్ గా చేయాలని ప్రయత్నిస్తున్నారు.

ఆంధ్రాకి పోవాలా.. ఈ క్యూలైన్ చుడండి

కత్రినా కష్టాలు