మొన్న పూనమ్.. ఈసారి మిలింద్.. బీచ్ లో నగ్నంగా!

గోవా బీచ్ లో పూనమ్ పాండే చేసిన హంగామాను ఇంకా జనాలు మరిచిపోకముందే, ఇప్పుడు అదే తరహా వార్తలతో మిలింద్ సోమన్ వార్తల్లోకెక్కాడు. గోవాలోని ఓ డ్యామ్ పై పూనమ్ పాండే నగ్నంగా ఫొటోషూట్…

గోవా బీచ్ లో పూనమ్ పాండే చేసిన హంగామాను ఇంకా జనాలు మరిచిపోకముందే, ఇప్పుడు అదే తరహా వార్తలతో మిలింద్ సోమన్ వార్తల్లోకెక్కాడు. గోవాలోని ఓ డ్యామ్ పై పూనమ్ పాండే నగ్నంగా ఫొటోషూట్ నిర్వహిస్తే.. అదే గోవాలోని ఓ బీచ్ లో మిలింద్ సోమన్ నగ్నంగా జాగింగ్ చేశాడు.

మిలింద్ ఇలా న్యూడ్ గా పరుగులుపెట్టడాన్ని చాలామంది వ్యతిరేకించారు. గో సురక్షా మంచ్ అనే సంస్థ అయితే ఏకంగా మిలింద్ పై కేసుపెట్టింది. ఐపీసీ సెక్షన్ 294 కింద మిలింద్ పై కొల్వా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైనట్టు.. దక్షిణ గోవా ఎస్పీ పంకజ్ సింగ్ ప్రకటించారు. అయితే ఆ వెంటనే మిలింద్ కు బెయిల్ కూడా దొరికింది.

మిలింద్ సోమన్ కు ఇలాంటి వివాదాలు కొత్తకాదు. గతంలో ఓ కండోమ్ యాడ్ లో కొండచిలువను చుట్టుకొని నగ్నంగా కనిపించాడు ఈ సూపర్ మోడల్. దాదాపు దశాబ్దానికి పైగా ఆ కేసు నడిచింది. ఇప్పుడు గోవాలో మరోసారి నగ్నంగా ప్రత్యక్షమై వివాదాస్పద వ్యక్తిగా మారాడు 55 ఏళ్ల మిలింద్.

అయితే గోవాలో ఇలా మినిమం గ్యాప్ లో అటు పూనమ్, ఇటు మిలింద్ ఇలా బట్టలిప్పి బయటకురావడం పెద్ద చర్చకు తావిచ్చింది. దీన్నిలా వదిలేస్తే రాబోయే రోజుల్లో గోవాలో నగ్నంగా తిరిగేవాళ్లు ఎక్కువైపోతారని వాదిస్తున్నాయి కొన్ని స్వచ్చంధ సంస్థలు.

చంద్రబాబు బీజేపీని కూడా మేనేజ్ చేశారా?