చరణ్-శంకర్ సినిమాకు బ్రేక్?

రామ్ చరణ్-శంకర్ సినిమా ఇలా మొదలై, అలా చకచకా షూటింగ్ మీదకు వెళ్లిపోయింది. ఎంత పర్సంట్ వర్క్ జరిగింది అన్నది పక్కన పెడితే చకచకా షూటింగ్ అయితే విశాఖపట్నం నుంచి అమృత్ సర్ వరకు…

రామ్ చరణ్-శంకర్ సినిమా ఇలా మొదలై, అలా చకచకా షూటింగ్ మీదకు వెళ్లిపోయింది. ఎంత పర్సంట్ వర్క్ జరిగింది అన్నది పక్కన పెడితే చకచకా షూటింగ్ అయితే విశాఖపట్నం నుంచి అమృత్ సర్ వరకు జరుగుతూనే వచ్చింది. కానీ ఇప్పుడు ఈ సినిమాకు బ్రేక్ పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. 

కమల్ హాసన్ విక్రమ్ సినిమా పెద్ద హిట్ కావడం అన్నది సమస్య. దానికీ దీనికీ ముడేమిటి అంటే అక్కడే వుంది అసలు విషయం.

తమిళనాట కమల్ క్రేజ్ ఎప్పుడైతే మరోసారి ప్రూవ్ అయిందో ఎప్పటి నుంచో పెండింగ్ లో వున్న, కోర్టు మెట్లు ఎక్కి వచ్చిన ఇండియన్ 2 సినిమాకు కదలిక వచ్చింది. ఈ సినిమాను శంకర్ చేయాల్సి వుంది. ఆ మేరకు అంతా పక్కాగా వుంది. ఆ సినిమా మీద తమిళనాట పెద్దవాళ్ల దృష్టి కూడా పడింది. దాంతో ఇప్పుడు ఆ సినిమా అర్జంట్ గా చేయాల్సి వచ్చినట్లు తెలుస్తోంది.

దాంతో రామ్ చరణ్ సినిమాకు పాజ్ బటన్ నొక్కి కమల్ సినిమా మీదకు శంకర్ వెళ్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో రామ్ చరణ్ కూడా తన తరువాత సినిమా మీదకు వెళ్లబోతున్నారని తెలుస్తోంది. ఆ సినిమాను యువి/ఎన్వీ ప్రసాద్ కలిసి నిర్మిస్తారు. గౌతమ్ తిన్ననూరి దర్శకుడు.