Advertisement

Advertisement


Home > Movies - Movie News

చావు ఇంట్లో ప్రేమ కహానీ

చావు ఇంట్లో ప్రేమ కహానీ

కొత్త పాయింట్ వుంటే తప్ప జనాన్ని ఆకర్షించడమూ కష్టం. థియేటర్ కు రప్పించడమూ కష్టం. అందుకే కొత్త దర్శకులు, కొత్త పాయింట్లు అవసరం అవుతున్నాయి టాలీవుడ్ కు. గీతా 2 సంస్థ ఇలా కొత్త పాయింట్ తో నిర్మిస్తున్న సినిమా చావు కబురు చల్లగా. కాశ్యప్ దర్శకుడు. కార్తికేయ-లావణ్య త్రిపాఠీ హీరో హీరోయిన్లు. ఈ సినిమా ఈ నెల 19న విడుదల అవుతున్న నేపథ్యంలో ట్రయిలర్ విడులయింది.

ఇప్పటికే టీజర్, అనసూయ ప్రత్యేక గీతం అన్నీ కలిపి ఈ చిన్న సినిమా మీద పెద్ద అంచనాలు తెచ్చాయి. ఇప్పుడు విడుదలయిన ఈ ట్రయిలర్ ఆ అంచనాలు పెంచేలాగే వుంది.  స్కూలు కుర్రాడు స్కూల్లో, ఆపీసుకు వెళ్లే వాడు ఆఫీసులో ప్రేమను వెదుక్కుంటాడు. నిత్యం చావు ఇళ్లకు వెళ్లేవాడు అక్కడ కాక ఇంకెక్కడ ప్రేమను వెదుక్కుంటాడు అన్నది హీరో లాజిక్. 

వాస్తవానికి ఇది హీరో లాజిక్ మాత్రమే కాదు, భర్త పోయిన దుఖంలో వున్న హీరోయిన్ ను హీరో ప్రేమించడంలో ఔచిత్యం ఏమిటి అని ప్రశ్నించేవారికి దర్శకుడు ఇచ్చే సమాధానం కూడా ఇదే కావచ్చు. హీరో హీరోయిన్ మధ్య సీన్లు చూస్తుంటే రవితేజ ఇడియట్ ను మరో రూపంలో చూసినట్లుంది. కార్తికేయ మాడ్యులేషన్, బాడీ లాంగ్వేజ్ భలేగా వున్నాయి. అసలు ఈ సినిమాలో కొత్త కార్తికేయను చూస్తున్నట్లుంది.

జేక్స్ బిజోయ్ బ్యాక్ గ్రవుండ్ స్కోర్ బాగుంది. మరీ ఇంత దిగజారిపోతున్నారేంట్రా జనాలు రోజు రోజుకీ అంటూ ట్రయిలర్ చివరలో డైలాగు వేయడం కూడా సబ్జెక్ట్ మీద ఎవరో సెటైర్ వేయకుండా డైరక్టర్ తనే వేసుకోవడం అనుకోవాలేమో? మొత్తం మీద ఓ భిన్నమైన సినిమా చూడబోతున్నాం అన్న ఫీలింగ్ ను తీసుకువచ్చింది ట్రయిలర్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?