Advertisement

Advertisement


Home > Movies - Movie News

చెక్ సినిమాకు సీక్వెల్ రాబోతోందా?

చెక్ సినిమాకు సీక్వెల్ రాబోతోందా?

ఈరోజు థియేటర్లలోకి వచ్చింది చెక్ సినిమా. నితిన్ హీరోగా నటించిన ఈ సినిమా క్లైమాక్స్ చూసి అంతా చిన్నపాటి షాక్ కు గురయ్యారు. సినిమా చూసినవాళ్లంతా చెక్ కు సీక్వెల్ ఉండొచ్చని మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ విషయాన్ని రిలీజ్ కు ముందే నితిన్ చెప్పాడు. కాకపోతే అప్పుడా విషయాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు.

చెక్ సినిమా క్లైమాక్స్ చాలా టిపికల్ గా ఉంటుందని 2 రోజుల కిందటే చెప్పుకొచ్చాడు నితిన్. సినిమాలో క్లైమాక్స్ చాలా బాగుంటుందని, అలాగే సినిమా సీక్వెల్ కు కూడా అవకాశం ఉందని అన్నాడు. ఈ కథ సీక్వెల్ కు సరిగ్గా సూట్ అవుతుందని అన్నాడు ఈరోజు సినిమా చూసిన ఆడియన్స్ కూడా దాదాపు ఇదే అభిప్రాయానికొచ్చారు.

నిజానికి చెక్ కథ రాసుకున్నప్పుడే దానికి సీక్వెల్ కూడా ప్లాన్ చేశాడట దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి. ఈమధ్యే ఈ సీక్వెల్ వర్క్ కూడా స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే చెక్ సినిమాకు వచ్చే రిజల్ట్ బట్టే దానికి సీక్వెల్ తీయాలా వద్దా అనేది ఆధారపడి ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే.

సినిమా సక్సెస్ అయితే సీక్వెల్ ప్రకటించడానికి నితిన్ ఏమాత్రం వెనకాడడు. అంతేకాదు, వచ్చే ఏడాది ఈ సీక్వెల్ స్టార్ట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే చెక్ సినిమాకు రెస్పాన్స్ అంతంతమాత్రంగానే ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సీక్వెల్ ప్రకటిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

ఓడిపోయే సరికి కుప్పం గుర్తుకు వచ్చిందా

ఈ సినిమా అడ‌క‌పోతే ప్రొడ్యూస‌ర్ల‌కు హ‌ర్ర‌రే

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?