పాత పద్ధతికి శ్రీకారం చుట్టిన చిరంజీవి

ఇప్పుడంటే సినిమాకు కొబ్బరికాయ కొట్టిన తర్వాత, రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. కానీ ఒకప్పుడు సినిమా ఓపెనింగ్ అయిన వెంటనే మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టేవారు. ఎందుకంటే, అప్పట్లో ఇళయరాజా లాంటి సంగీత దర్శకులు మద్రాసులోనే…

ఇప్పుడంటే సినిమాకు కొబ్బరికాయ కొట్టిన తర్వాత, రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. కానీ ఒకప్పుడు సినిమా ఓపెనింగ్ అయిన వెంటనే మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టేవారు. ఎందుకంటే, అప్పట్లో ఇళయరాజా లాంటి సంగీత దర్శకులు మద్రాసులోనే ఉండేవారు కాబట్టి. ఆ తర్వాత పరిస్థితులు మారినప్పటికీ చాన్నాళ్ల పాటు ఇదే పద్ధతి కొనసాగింది. మళ్లీ ఇన్నాళ్లకు చిరంజీవి ఈ పద్ధతిని రీ-స్టార్ట్ చేశారు.

ఈరోజు చిరంజీవి కొత్త సినిమా మొదలైంది. వశిష్ఠ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై కొత్త సినిమా స్టార్ట్ చేశారు చిరు. పూజాకార్యక్రమాలతో లాంఛనంగా ఈ సినిమా మొదలైంది. మూవీకి కొబ్బరికాయ కొట్టి, మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టారు.

చిరంజీవి కెరీర్ లో 156వ సినిమా ఇది. నిజానికి ఈ మూవీ చిరు కెరీర్ లో 157వ సినిమా అవ్వాలి. ఇన్నాళ్లూ యూవీ క్రియేషన్స్ బ్యానర్ తో పాటు, అభిమానులు కూడా ఈ సినిమాను #మెగా157 అని వ్యవహరించేవారు. కానీ కూతురు నిర్మాతగా తను చేయాల్సిన 156వ ప్రాజెక్టును చిరంజీవి రద్దు చేసుకున్నారు. అలా వశిష్ఠ సినిమా కాస్త ముందుకొచ్చింది.

సినిమా ముందుకొచ్చినా, ఇది థియేటర్లలోకి రావడానికి చాలా టైమ్ పడుతుంది. సోషియో ఫాంటసీ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ వర్క్ కు చాలా టైమ్ పట్టేలా ఉంది. గ్రాఫిక్స్, సెట్ వర్క్ కు ఎక్కువ టైమ్ తీసుకుంటారు. దీంతో పాటు షూటింగ్ డేస్ కూడా ఎక్కువే. అందుకే ఈ సినిమాను 2025 సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.