నిజం నిలకడ మీద తెలుస్తుంది- చిరంజీవి

బీజేపీ సీనియ‌ర్ నేత, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్ర‌తి సంవ‌త్స‌రం.. దసరా పండుగ సందర్భంగా తెలంగాణ సాంప్రదాయిక పద్ధతిలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూంటారు. ఈ సందర్భంగా రాజకీయ,…

బీజేపీ సీనియ‌ర్ నేత, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్ర‌తి సంవ‌త్స‌రం.. దసరా పండుగ సందర్భంగా తెలంగాణ సాంప్రదాయిక పద్ధతిలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూంటారు. ఈ సందర్భంగా రాజకీయ, సామాజిక ప్రముఖులను ఆహ్వానించి, తెలంగాణ సాంప్రదాయిక వంటకాలతో విందు ఇస్తారు. ఈసారి ముఖ్య అతిధిగా మెగా స్టార్ చిరంజీవి హాజరైయారు.

ఈ కార్య‌క్ర‌మంలో చిరంజీవి మాట్లాడుతూ.. దత్తాత్రేయ నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమానికి గ‌త కాలం నుంచి రావాలని కోరుకొంటున్నాను. కానీ నా తమ్ముడు పవన్ కల్యాణ్, అల్లు అరవింద్‌కు ఆహ్వానం లభించింది. కానీ నాకు దత్తాత్రేయ గారు ఆహ్వానం పంపలేదు. ఆయన దృష్టి పడిన తర్వాత నేను వద్దామని అనుకొన్నాను. నా కెరీర్‌లో సూపర్‌హిట్ కొట్టిన రోజే దత్తాత్రేయ నాకు ఈ కార్యక్రమానికి ఆహ్వానం పలికడం చాలా ఆనందంగా ఉంద‌న్నారు.

సినిమా ప‌రిశ్ర‌మ‌లో హీరోల అభిమానుల మ‌ధ్య విద్వేషాలు ర‌గులుతుండేవ‌ని, వాటిని క‌ట్ట‌డి కొసం ప్ర‌య‌త్నించే వాడిని అనీ, సినీ తార‌ల మధ్య విభేదాలు ఉండ‌కూడ‌ద‌నే కార‌ణంతో నా సినిమాలు హీట్ అయిన‌ప్పుడు అంద‌రిని పిలిచి విందు ఇచ్చేవాడిని అని, అలా హీరోల మ‌ధ్య ఎలాంటి ఇగోలు లేకుండా ప్ర‌య‌త్నించేవాడిని అని చిరంజీవి తెలిపారు.

నేను రాజ‌కీయాల్లోకి వెళ్లిన‌ప్పుడు కూడా రక‌ర‌కాలుగా విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేశార‌ని, బ్ల‌డ్ అమ్ముకొంటున్నాని ఆరోప‌ణ‌లు చేసిన ఏనాడు స్పందించలేద‌న్నారు. వాస్త‌వాలు ఆల‌స్యంగా తెలుస్తాయాని, మాటకు లొంగని వాడు.. హృదయ స్పందనకు లొంగిపోతారు. కాబట్టి దత్తన్న నిర్వహించే ఆలయ్ బలయ్ కార్యక్రమ సారాన్ని ఆచరించండి.. నేను ఎప్పుటి నుంచో ఆచరిస్తున్నాను అంటూ చిరంజీవి అన్నారు.