సాయిధ‌ర‌మ్ మ‌ద్య సేవ‌నంపై చిరు క్లారిటీ

త‌న మేన‌ల్లుడు, న‌టుడు సాయిధ‌ర‌మ్ తేజ్ ప్ర‌మాదానికి గురి కావ‌డంపై మెగాస్టార్ చిరంజీవి ట్విట‌ర్ వేదిక‌గా స్పందించారు.  Advertisement ప్ర‌మాదంపై ర‌క‌ర‌కాల ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఆయ‌న వివ‌ర‌ణ ప్రాధాన్యం సంత‌రించుకుంది. అలాగే సాయిధ‌ర‌మ్…

త‌న మేన‌ల్లుడు, న‌టుడు సాయిధ‌ర‌మ్ తేజ్ ప్ర‌మాదానికి గురి కావ‌డంపై మెగాస్టార్ చిరంజీవి ట్విట‌ర్ వేదిక‌గా స్పందించారు. 

ప్ర‌మాదంపై ర‌క‌ర‌కాల ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఆయ‌న వివ‌ర‌ణ ప్రాధాన్యం సంత‌రించుకుంది. అలాగే సాయిధ‌ర‌మ్ ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని ఆయ‌న అన్నారు.

“సాయి తేజ్ డ్రైవింగ్ సమయంలో హెల్మెట్ ధరించారు , ఎలాంటి మద్యం సేవించలేదు , రోడ్డుపై ఇసుక ( మట్టి ) ఉండడంతో అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యారు , ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది” అని చిరు ట్వీట్ చేశారు.

బ‌హుశా మ‌ద్యం సేవించి, మ‌త్తులో అదుపు త‌ప్పి ప్ర‌మాదానికి గుర‌య్యార‌నే ప్ర‌చారం ఆయ‌న దృష్టికి వెళ్లిన‌ట్టుంది. అందుకే ఆయ‌న ఆ విష‌య‌మై క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా రోడ్డుపై ఇసుక ఉండ‌డం, వేగంగా వెళుతున్న వాహ‌నం అదుపు త‌ప్పిన‌ట్టు చిరంజీవి ప్ర‌మాద తీరును వివ‌రించారు.