‘చిరు’ ట్వీటుకు కూడా నోచుకోలేదా?

ఆంధ్ర సిఎమ్ జగన్ వీర బిజీ కావచ్చు. ఆయనకు సవాలక్ష పనుల వుండొచ్చు. కానీ ఆయన ఒక్కో పని ఒక్కొక్కరికి అప్పగిస్తారు. అలాంటి వాళ్లు అంతా తమ పని తాను సక్రమంగా చేయకపోతే, అంతిమంగా…

ఆంధ్ర సిఎమ్ జగన్ వీర బిజీ కావచ్చు. ఆయనకు సవాలక్ష పనుల వుండొచ్చు. కానీ ఆయన ఒక్కో పని ఒక్కొక్కరికి అప్పగిస్తారు. అలాంటి వాళ్లు అంతా తమ పని తాను సక్రమంగా చేయకపోతే, అంతిమంగా నష్టపోయేది జగన్ నే. 

సెలబ్రిటీల ట్విట్టర్ అక్కౌంట్లు అన్నీ వేరే వాళ్లే చూస్తుంటారు. వీళ్ల చెప్పాలి లేదా వాళ్లు అడగాలి. అప్పుడే ట్విట్టర్ లో ట్వీటు పడుతుంది. అది సినిమా హీరోలు, నిర్మాతలు, డైరక్టర్లు, ఆఖరికి రాజకీయ నాయకులు అయినా ఇదే తంతు

జగన్ ట్విట్టర్ అక్కౌంట్ ను ఆయన సన్నిహిత బంధువు, వైకాపా కీలకనేత కుమారుడు నిర్వహిస్తాడు. మరి ఈ పిలగాడు చెప్పడో, గుర్తు చేయడో? లేక జగన్ తెలియదో, పడాల్సిన టైమ్ లో ట్వీట్ లు పడవు

టాలీవుడ్ జగన్ ను పట్టించుకోవడం లేదు అన్న మాట వుంది. మరి ఇంతకీ జగన్ టాలీవుడ్ ను ఏ మేరకు పట్టించుకుంటున్నారు. మహేష్ బాబు బర్త్ డే అయితే ఓ చిన్న ట్వీట్ వేస్తే ఏమైపోతుంది? మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజుకు అందరూ ట్వీట్ లు వేసారు జగన్ తప్ప. 

మరి ట్విట్టర్ అక్కౌంట్ నిర్వహించేవాళ్లు గుర్తు చేయలేదో? మరేం జరిగిందో మొత్తానికి ఇలాంటి చిన్న చిన్న వాటి వల్ల కూడా నెగిటివ్ వచ్చేది జగన్ కే తప్ప మరొకరికి కాదు. పార్టీ పదవులు, అధికారపదవులు తీసుకోవడంలో వున్న శ్రద్ద ట్విట్టర్ అక్కౌంట్ నిర్వహణ మీద కూడా పెట్టాలి. లేదా ఆ పనిని వదిలేయాలి. లేదా అంటే అధినేత బదనామ్ అవుతారని గ్రహించాలి.