కొన్ని సినిమాలు అంతే.. ఒరిజినల్ ను కొనసాగిద్దాం అనుకుంటే అంత వీజీ కాదు. దశాబ్దంన్నర కిందట వచ్చి సంచలనాలు సృష్టించిన చంద్రముఖికి సీక్వెల్ చేయడానికి సిద్దపడ్డారు దర్శకుడు వాసు. కానీ ఒక్క వడివేలు తప్ప అప్పటి పాత్రధారులు ఎవ్వరూ లేరు. అయితే లారెన్స్ సినిమా కాబట్టి కాస్త ఆశ.. ఏదో వుంటుందని. పైగా కంగనా రనౌత్ హీరోయిన్. లైకా నిర్మాణం. అందుకే కాస్త ఆసక్తి.
ఈ సినిమా తమిళ వెర్షన్ ట్రయిలర్ ను విడుదల చేసారు. చూసినవాళ్లంతా డిస్సపాయింట్ అయ్యేలా వుందీ ట్రయిలర్. కేవలం లారెన్స్ ఫ్యాన్స్ కోసం ట్రయిలర్ ను కట్ చేసినట్లుంది తప్ప, చంద్రముఖి సినిమా కోర్ పాయింట్ అయిన హర్రర్ జానర్ ను అస్సలు టచ్ చేయలేకపోయారు. పైగా టోటల్ స్టార్ కాస్ట్ ను చూపించడం కోసం ఒక్కో సీన్ అతుకు వేసుకుంటూ వచ్చారు. అవేవీ రక్తి కట్టలేదు. వీటన్నింటికి తోడు కంగన రనౌత్ ను ఒక్క సీన్ కే పరిమితం చేసారు.
అసలు చంద్రముఖిని చూసే సీన్ ట్రయిలర్ లో వచ్చే సరికి ఏ రేంజ్ లో ఎత్తుకోవాలి… ఎలాంటి ఉత్కంఠను జనరేట్ చేయాలి. అవేమీ లేవు. చంద్రముఖికి కీలకం పాటలు. కీరవాణి వర్క్ ట్రయిలర్ లోకి రాలేదు. మొత్తం మీద టోటల్ డిస్సపాయింట్ మెంట్ మిగులుతుంది ట్రయిలర్ చూసిన వారికి.
తెలుగు రాష్ట్రాలకు ఈ సినిమాను 13 కోట్లు ప్లస్ జిఎస్టీ లెక్కన కొన్నారు. ఈనెల రెండో వారంలో విడుదల కాబోతోంది.