సినిమా ఫైనాన్స్ కు వడ్డీ మాఫీ?

సినిమా జనాలకు పెద్ద సమస్య ఫైనాన్స్. రూపాయిన్నర నుంచి అవసరాన్ని బట్టి మూడు, మరీ ఆపత్కర పరిస్థితిన బట్టి అయిదు రూపాయల వరకు కూడా వుంటుంది వడ్డీ. కోట్లలో అప్పులు అంటే లక్షల్లో వడ్డీలు…

సినిమా జనాలకు పెద్ద సమస్య ఫైనాన్స్. రూపాయిన్నర నుంచి అవసరాన్ని బట్టి మూడు, మరీ ఆపత్కర పరిస్థితిన బట్టి అయిదు రూపాయల వరకు కూడా వుంటుంది వడ్డీ. కోట్లలో అప్పులు అంటే లక్షల్లో వడ్డీలు తప్పవు. మీరీ పెద్ద సంస్థలు అయితే బ్యాంకు రుణాలు కొంత వరకు వుంటాయి. అలాగే కొంత వరకు రొటేషన్ వుంటుంది. ఎంతయినా ఎంతో కొంత ఫైనాన్స్ అయితే తప్పదు. ప్రాజెక్టులు రన్నింగ్ లో వున్న ప్రతి సినిమాకు ఇంతో అంతో ఫైనాన్స్ వుంటుంది,

అలాగే కొన్ని సంస్థలు సినిమా ఫైనాన్స్ కాకుండా పొలిటికల్ ఫైనాన్స్ కూడా తెచ్చుకుంటాయి. అంటే రాజకీయాల్లో ఆర్జించినవి తీసుకువచ్చి సినిమాల్లో తెలుసున్నవారికి వడ్డీకి ఇస్తారు. వీటికి వడ్డీ కాస్త రీజనబుల్ గా వుంటుంది. అసలు అలాగే వుంటుంది. నెల నెలా వడ్డీలు వెళ్తుంటాయి. 

ఇప్పుడు ఈ కరోనా కల్లోలంలో వడ్డీలు కట్టడం పెద్ద సమస్య.  సినిమాలు పూర్తయిన తరువాత విడుదల చేసే ముందు ఫైనాన్స్ సెటిల్ మెంట్లు వుంటాయి. కానీ ఇప్పుడు అకారణ ఆలస్యం తప్పడం లేదు. అందువల్ల సినిమా పెద్దలు అందరూ కలిసి ఫైనాన్సియర్లను కనీసం రెండు నెలలు అయినా వడ్డీ మాఫీ చేయాలని కోరుతున్నట్లు వినిపిస్తోంది. ఈ విషయంలో ఫైనాన్సియర్ల నుంచి సానుకూల స్పందన వస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది కనుక ఫలవంతం అయితే నిర్మాతల తలల మీద నుంచి కాస్త భారం దిగినట్లు అవుతుంది. దాదాపు విడుదల కావాల్సిన సినిమాలు, విడుదలకు మరికాస్త వర్క్ పెండింగ్ వున్న సినిమామాలు ఇలా అన్నింటి మీదా కలిసి, కనీసం వంద కోట్లకు పైగానే ఫైనాన్స్ వుంటుందని అంచనా. మరి దాన్ని బట్టి వడ్డీలు లెక్కపెడితే..? . అందువల్ల గిల్డ్ తక్షణ కర్తవ్యం ఈ వడ్డీ మాఫీ కోసం ప్రయత్నించడమే.

కన్నా బీజేపీకి మాత్రం కన్నం వెయ్యకు

కన్నా.. దమ్ముంటే రా కాణిపాకంలో ప్రమాణం చేద్దాం