సినిమా జనాలకు కరోనా భయం

ఊ అంటే విదేశాలకు ఛలో అంటారు సినిమా జనాలు. ఈ మధ్య కాస్త టైమ్ దొరికితే చాలు శ్రీలంక అంటున్నారు. బ్యాంకాక్ అంటున్నారు. కాదంటే దుబాయ్ ఛలో అంటున్నారు. కానీ ఇప్పుడు దాదాపు మూడు…

ఊ అంటే విదేశాలకు ఛలో అంటారు సినిమా జనాలు. ఈ మధ్య కాస్త టైమ్ దొరికితే చాలు శ్రీలంక అంటున్నారు. బ్యాంకాక్ అంటున్నారు. కాదంటే దుబాయ్ ఛలో అంటున్నారు. కానీ ఇప్పుడు దాదాపు మూడు వంతుల మంది బుద్దిగా హైదరాబాద్ లోనే వుంటున్నారు. కారణం మరేమీ కాదు. కరోనా వైరస్ భయమే. ఏ దేశానికి వెళ్తే ఎక్కడ ఏం అంటుకుంటుందో అని భయపడుతున్నారు. ప్రపంచం అంతా కరోనా వైరస్ చుట్టుముడుతోంది. అందుకే షూటింగ్ ల సంగతి పక్కన పెడితే, ప్రస్తుతానికి ఎక్కడకూడా కదలడం లేదు మన సినిమా జనాలు.

సమ్మర్ వస్తోంది. కచ్చితంగా చాలా మంది ఛలో ఫారిన్ అంటారు. కానీ ఈసారి మరి అలా అంటారా?అన్నది చూడాలి. అయితే మనవాళ్లు ఎక్కువగా యూరోపియన్ కంట్రీస్ లేదా అమెరికా కు వేసవి టూర్లకు వెళ్తుంటారు కాబట్టి సమస్య వుండకపోవచ్చు.

కానీ ప్రస్తుతానికి వీకెండ్ ఎంజాయ్ మెంట్ లకు, క్యాసినో సరదాలకు, ఇతరత్రా వ్యవహారాలకు మాత్రం కాస్త కామా పడింది. మూమూలుగా అయితే మనవాళ్లు ఊఅంటే విదేశాల్లో వాలిపోతారు. క్యాసినోలు, మెసాజ్ లు, షాపింగ్ లు ఒకటి కాదు. అలాంటివి ఇప్పుడు చాలా వరకు బంద్ అయ్యాయి. అంతే కాదు, నాన్ వెజ్ వ్యవహారాలు కూడా తగ్గినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 'మా ఇంట్లో చికెన్ తినడం మానేసాం' అని నిత్యం చికెన్ లేకుండా ముద్ద దిగని ఓ ప్రొడ్యూసర్ అనడం విశేషం.

అన్నయ్య గురుంచి ఎవడైనా బ్యాడ్ గా మాట్లాడితే చంపేస్తా