జేఎస్సార్ మూవీస్ పతాకం పై బి.లింగుస్వామి సమర్పణ లో జొన్నలగడ్డ శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ఆటో రజని’.
‘ప్రేమెంత పనిచేసే నారాయణ’ సినిమాతో పేరు తెచ్చుకున్న జొన్నలగడ్డ హరికృష్ణ హీరోగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
పవర్‌పుల్ మాస్ ఎంటర్టైనర్‌గా వస్తున్న ఈ చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సులు అందించారు.
ఈ శుక్రవారం సాయంత్రం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో చిత్ర యూనిట్ సీఎం జగన్‌ను కలిసి ఆశీస్సులు తీసుకుంది.
సీఎం జగన్ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ… ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చిన తమ హీరోకి బ్లెస్సింగ్స్ అందించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాస్.
సీఎం జగన్ ఆశీస్సులు అందుకున్న మొదటి చిత్రంగా ‘ ఆటో రజని’ నిలిచిపోతుందని ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో తాము చేసిన ‘జననేత జగనన్న’ పాట గురించి ప్రత్యేకంగా జగనన్న అభినందించడం జీవితంలో మర్చిపోలేమమన్నారు.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే దలవుతుందని వెల్లడించారు. హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణల పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తామన్నారు.