ఆంధ్ర సిఎమ్ జగన్ చాలా సింపుల్ గా వుంటారని, గతంలో ఫోన్ లో మాట్లాడిన పరిచయం వున్నా, నేరుగా కలిసినపుడు ఆ సింపుల్ సిటీ తెలిసిందని సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నారు. సర్కారు వారి పాట మీడియా మీట్ లో సిఎమ్ జగన్ ను కలిసి ఎక్స్ పీరియన్స్ పై ప్రశ్నిస్తే మహేష్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు.
సిఎమ్ జగన్ కు అన్ని విషయాల మీద అవగాహన వుందని, చాలా చేపు అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారని, మళ్లీ మళ్లీ ఇలాంటి సమావేశాలు ఙరగాలని ఆకాంక్షించారని చెప్పారు.
రాజమౌళితో ఒక్క సినిమా అంటే పాతిక సినిమాల పెట్టు అని, అందువల్ల అలాంటి ప్రాజెక్టుకు రెండేళ్లు పట్టినా ఫ్యాన్స్ కు హ్యపీయే అని మహేష్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గౌతమ్, సితార ఇద్దరవీ వేరు వేరు ఆలోచనలు అని, ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపించడంపై సితారని గౌతమ్ ఆటపట్టిస్తుంటాడని మహేష్ అన్నారు. సినిమాల్లోకి రావడం రాకపోవడం అన్నది గౌతమ్ ఇష్టాన్ని బట్టి వుంటుందన్నారు.
సర్కారు వారి పాటలో తన క్యారెక్టరైజేషన్ పోకిరి సినిమాలో హీరో పాత్రకు దగ్గరగా వుంటుందని, అందుకే ఈ సినిమా టైమ్ లో ఆ సినిమా ప్రస్తావన చేయాల్సి వచ్చిందన్నారు. త్రివిక్రమ్ డైలాగ్ రైటింగ్ అంటే తనకు చాలా ఇష్టమని, చాలా కాలం తరువాత ఆయనతో సినిమా చేస్తున్నానని, అది నెక్ట్స్ లెవెల్ లో వుంటుందని మహేష్ అన్నారు.
దర్శకుడు పరుశురామ్ రైటింగ్ అంటే కూడా తనకు ఇష్టమన్నారు. రెండేళ్ల కోవిడ్ కాలంలో చాలా జరిగాయని, కొంతమందిని కోల్పోయానని, అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎమోషనల్ అయ్యానని మహేష్ అన్నారు. మన సినిమాలు పాన్ ఇండియా లెవెల్ కు వెళ్లాలన్నది తన ఆలోచన అని, మొదటి నుంచీ అదే చెబుతున్నానని, అంతే తప్ప మనం వెళ్లి అక్కడ సినిమా తీయడం కాదని వివరించారు.
హీరో కృష్ణగారి బయోపిక్ అన్న ఆలోచన లేదని, ఆ ప్రశ్న వింటేనే కాళ్లు వణుకుతాయని అన్నారు. సర్కారు వారి పాట సినిమాకు థమన్ ప్రాణం పెట్టి సంగీతం అందించాడని, కళావతి పాట తాము అంతా ఫస్ట్ నే ఓకె చేయకపోయినా తన మీద నమ్మకం వుంచమని థమన్ పట్టుబట్టి ఆ ట్యూనే నే వుంచాడన్నారు. ఇప్పుడు ఏ సినిమాకైనా థమన్ బ్యాక్ గ్రవుండ్ స్కోర్ కీలకం అని అంటుంటే చాలా హ్యాపీగా వుందన్నారు.