ఎన్టీఆర్ ముస్లిం గెటప్.. టీజర్ పై మరో వివాదం

ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ఎన్టీఆర్ టీజర్ పై ఇప్పటికే ఎన్నో విమర్శలు, మరెన్నో వివాదాలు చూశాం. మరీ ముఖ్యంగా కొమరం భీమ్ పాత్రధారిని ముస్లిం గెటప్ లో చూపించడాన్ని చాలామంది తప్పుబట్టారు. Advertisement దర్శకుడు…

ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ఎన్టీఆర్ టీజర్ పై ఇప్పటికే ఎన్నో విమర్శలు, మరెన్నో వివాదాలు చూశాం. మరీ ముఖ్యంగా కొమరం భీమ్ పాత్రధారిని ముస్లిం గెటప్ లో చూపించడాన్ని చాలామంది తప్పుబట్టారు.

దర్శకుడు ఫిక్షన్ అని చెప్పుకున్నప్పటికీ, పాత్ర పేరుకు కొమరం భీమ్ అని పెట్టడం, ఆ పాత్రను ముస్లిం గెటప్ లో చూపించడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. జల్-జంగల్-జమీన్ నినాదంతో నిజాం పాలనపై తిరుగుబాటు జెండా ఎగరేసిన మన్యం వీరుడి పాత్రకు ఓ సామాజిక వర్గానికి చెందిన టోపీని ఎలా పెడతారంటూ ఆదివాసీలు మండిపడుతున్నారు.

తమ నాయకుడ్ని కించపరిచేలా తీసిన సన్నివేశాల్ని తొలిగించాలని లేదంటే కోర్టుకు వెళ్తామని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ మేకర్స్ నిజంగా దీన్ని ఫిక్షన్ అని చెప్పదలుచుకుంటే.. కొమరం భీమ్ అనే పేరును ఉపయోగించకూడదని డిమాండ్ చేస్తున్నారు.

కేవలం సినిమా నుంచి మాత్రమే కాకుండా.. తాజాగా రిలీజ్ చేసిన టీజర్ నుంచి కూడా ఆ సన్నివేశాల్ని తొలిగించాలని ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రాజమౌళికి ఇలాంటి వివాదాలు కొత్తకాదు. గతంలో బాహుబలి టైమ్ లో కూడా ఆదివాసీల నుంచి రాజమౌళికి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

ఇక కర్ణాటకకు చెందిన ఓ తెగ, ఏకంగా బాహుబలి టైటిల్ పెట్టకూడదంటూ అభ్యంతరం వ్యక్తంచేసింది. వాటన్నింటినీ అప్పట్లో విజయవంతంగా అధిగమించిన రాజమౌళి.. ఇప్పుడు కొమరం భీమ్ పాత్రపై వస్తున్న వివాదాల్ని ఎలా ఎదుర్కొంటాడో చూడాలి.

చిక్కంతా కొమరం భీమ్ పాత్రను ముస్లిం గెటప్ లో చూపించడంపైనే వస్తోంది. సినిమాలో భీమ్ ను ముస్లిం కుర్రాడిగా చూపించలేదని, కేవలం కథలో భాగంగా భీమ్ ఆ వేషం వేస్తాడని ఆల్రెడీ కథనాలు మొదలయ్యాయి. అయితే వీటిపై నేరుగా రాజమౌళి స్పందిస్తే బాగుంటుంది. గతంలో బాహుబలి టైమ్ లో చేసినట్టుగానే, ఈసారి కూడా ముందుగానే రాజమౌళి రియాక్ట్ అయిందే బాగుంటుంది.

దుబ్బాకలో రూపాయి ఖర్చు పెట్టకుండా గెలుస్తా