హీరోయిన్ కు ముద్దు పెట్టి సారీ చెప్పిన నాగచైతన్య

బంగార్రాజు ఈవెంట్ లో నాగచైతన్య, దక్షా నగార్కర్ మధ్య జరిగిన 'చూపుల భాష' గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఓవైపు స్టేజ్ పై నాగార్జున మాట్లాడుతుంటే.. మరోవైపు ఈ హీరోహీరోయిన్లిద్దరూ చూపులతో మాట్లాడుకున్నారు. అప్పట్లో…

బంగార్రాజు ఈవెంట్ లో నాగచైతన్య, దక్షా నగార్కర్ మధ్య జరిగిన 'చూపుల భాష' గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఓవైపు స్టేజ్ పై నాగార్జున మాట్లాడుతుంటే.. మరోవైపు ఈ హీరోహీరోయిన్లిద్దరూ చూపులతో మాట్లాడుకున్నారు. అప్పట్లో ఆ వీడియో తెగ వైరల్ అయింది. అంతేకాదు, దక్షా నాగార్కర్ కు మంచి గుర్తింపు కూడా తెచ్చిపెట్టింది ఆ క్లిప్.

ఆ టైమ్ లో నాగచైతన్యకు, దక్షకు మధ్య ఏదో ఉందంటూ పుకార్లు కూడా వ్యాపించాయి. కొన్నాళ్ల పాటు ఆ రూమర్లు కొనసాగాయి కూడా. మళ్లీ ఇన్నాళ్లకు నాగచైతన్యపై స్పందించింది దక్షా నాగార్కర్. నాగచైతన్య లాంటి స్వీట్ బాయ్ ను ఏ అమ్మాయి అయినా తన లైఫ్ లో కోరుకుంటుందని స్టేట్ మెంట్ ఇచ్చింది.

“నాగచైతన్య లాంటి స్వీట్ అండ్ సింపుల్ లవర్ తమ జీవితాల్లో ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. చైతూ చాలా కూల్ అండ్ స్మార్ట్. అతడు అమ్మాయిలపై చాలా కేర్ చూపిస్తాడు. దాన్ని నేను ఫీల్ అయ్యాను. షూటింగ్ లో ముద్దు పెట్టుకునే సీన్లు, కౌగిలించుకునే సన్నివేశాలు పడ్డాయి. ఆ సీన్స్ చేసిన తర్వాత నాగచైతన్య నాకు సారీ చెప్పాడు. అంత స్వీట్ అబ్బాయి చైతూ.”

ఇలా నాగచైతన్యపై తనకున్న అభిమానాన్ని బయటపెట్టింది దక్షా నాగార్కర్. ఇన్ని విషయాలు చెప్పిన దక్ష.. ఆరోజు బంగార్రాజు ఫంక్షన్ లో నాగచైతన్యను చూస్తూ కొంటెగా కనుసైగ చేసిన విషయంపై మాత్రం స్పందించలేదు. నాగచైతన్యతో నెక్ట్స్ సినిమా చేసినప్పుడు ఆ మేటర్ బయటపెడతానంటూ తప్పించుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రావణాసుర సినిమా ప్రచారంలో బిజీగా ఉంది.