నాని పాన్ ఇండియా చిత్రం ‘దసరా’. సుధాకర్ చెరుకూరి నిర్మాత. శ్రీకాంత్ ఒదెల దర్శకుడు. ఈ చిత్రం మార్చి 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో గ్రాండ్ గా విడుదలౌతుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసిన అవినాష్ కొల్లా మీడియాతో ‘దసరా’ విశేషాలని పంచుకున్నారు.
దసరా కథా నేపధ్యం పూర్తిగా భిన్నమైనది. తెలంగాణలోకి ఒక ఊరికి సబంధించిన కల్చర్, అలవాట్లు, కట్టుబాట్లు వుంటాయి. ఆ ఊరికి కోల్ మైన్ దగ్గరగా వుండటం వలన పెద్దపెద్ద వాహనాలు ఊరి నుంచే వెళ్తాయి. దాని కారణంగా సహజంగానే రస్టిక్ టోన్ వచ్చింది. నాకు పేరు వచ్చే కంటెంట్ వున్న సినిమాలు నాని వలనే వచ్చాయి. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నా వంతు న్యాయం చేస్తున్నాను.
నాని ఇదివరకు సినిమాలతో పోల్చుకుంటే దసరా చాలా డిఫరెంట్ మూవీ. కల్చరర్ గా ఒక పాతికేళ్ళ క్రితం నాటి ఊరు ఇందులో కనిపిస్తుంది. ఈ సినిమా కథకు విధమైన ఊరు కావాలి. దాని కోసం అడవి లాంటి ఒక ఖాళీ ప్రదేశం తీసుకొని భారీ విలేజ్ సెట్ వేశాం. ఇల్లు, స్కూల్, ఒక మైదానం, బార్ ఇలా ఒక ఐదు వందల మంది నివసించే గ్రామాన్ని నేచురల్ గా క్రియేట్ చేశాం. 98 శాతం షూటింగ్ సెట్ లోనే జరిగింది.
శ్రీకాంత్ ది తెలంగాణ నేపధ్యం. తన ఊరు గురించే కథ రాసుకున్నాడు. తొలిసారి దర్శకత్వం చేస్తున్నప్పటికీ అన్ని విషయాలపై చాలా క్లారిటీ వుంటుంది. తన కథకి ఏం కావాలో అతనికి చాలా బాగా తెలుసు. కథ చెప్పినప్పుడే ట్రైలర్ కట్ ఎలా వుంటుందో అతని తెలుసు. అంత క్లారిటీ వున్న దర్శకుడు.
ఊరు సెట్ అనగానే బేసిగ్గా ఈస్ట్ వెస్ట్ ఆంధ్ర రిఫరెన్స్ లోకి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ థిన్ లైన్ వుంది. ఇంటిపై వేసే పెంకులో కూడా ఆంధ్రకి తెలంగాణకి తేడా వుంటుంది. అవన్నీ జాగ్రత్తలు తీసుకున్నాం. వర్కింగ్ డేస్ ఎక్కువ కాబట్టి సిమెంట్ స్టోన్స్ విండోలు తలుపులు ఏవీ డమ్మి లేకుండా నేచురల్ గా కలెక్ట్ చేయడానికి చాలా సమయం పట్టింది. మైనింగ్ కి చుట్టుపక్కల వున్న గ్రామాల్లో ఎలాంటి వాతావరణం వుంటుందో అదే వాతవరణాన్ని చాలా సహజంగా క్రియేట్ చేశాం. ఇందులో ఒక పెద్ద బంగ్లా వుంటుంది. అందులో ఒకొక్క దర్వాజనే మూడు లక్షలు పెట్టి కొన్నాం. చాలా ఆసక్తికరమైన ఎలిమెంట్స్ వుంటాయి.
ఒక కొత్త దర్శకుడికి ఇంత మంచి స్పెషిలిటీ ఇవ్వడం నిర్మాతల గొప్పదనం. ఈ కథ అంత గ్రాండ్ నెస్ ని కోరుతుంది. ఇంత మంచి కథకి ఖర్చు చేయడం అవసరమే. డెబ్బై శాతం సినిమా ఎక్స్ టిరియర్ లో వుంటుంది. నేచురల్ లొకేషన్ లో రస్టిక్ టోన్ అచీవ్ చేయడం కష్టం. అందుకే సెట్ కి వెళ్లాం. కథ పరంగా ఇది సరైన నిర్ణయమే. మొత్తం సెట్ వేయడానికి రెండున్న నెలలు పట్టింది. దాదాపు 800 పైగా పని చేశారు. దాదాపు 22 ఎకరాల్లో సెట్ వేశాం. ట్రైన్ సీక్వెన్స్ కూడా అక్కడే వేశాం. ప్రొడక్షన్ వైజ్ గా చాలా కలిసొచ్చింది.