Advertisement

Advertisement


Home > Movies - Movie News

డేట్ ఫిక్స్ చేసుకున్న నాగశౌర్య

డేట్ ఫిక్స్ చేసుకున్న నాగశౌర్య

నాగశౌర్య తన హోమ్ బ్యానర్ మీద నిర్మించిన సినిమా ‘కృష్ణ వృింద విహారి’. ఈ సినిమా విడుదల డేట్ కోసం టాలీవుడ్ ఔటర్ లో అలా వెయిట్ చేస్తూంది. ఫ్లాట్ ఫారమ్ ఖాళీ అయితే లోపలికి వద్దామని చూస్తొంది.

ఇప్పుడు ఓ డేట్ దొరికింది. సెప్టెంబర్ 23న విడుదల డేట్ గా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అనీష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ మోడల్, నటి షెర్లీ షెటియా హీరోయిన్ గా నటించింది.

విభిన్న స్థాయిలకు, సంప్రదాయాలకు చెందిన ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న తరువాత వచ్చిన సమస్య చుట్టూ తిరిగే ఈ కథలో సీనియర్ హీరోయిన్ రాధిక కీలకపాత్రలో నటించారు. హైదరాబాద్ తో పాటు కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో ఈ సినిమాను షూట్ చేసారు. ఆర్ ఎఫ్ సి లో వేసిన తెలుగుదనం ఉట్టిపడే సెట్ లో ఎక్కువ రోజులు షూట్ చేసారు.

ఇప్పటికే టీజర్ పాట‌లు విడుదల చేసారు. అవన్నీ సినిమాపై మంచి బ‌జ్ క్రియేట్ చేశాయి. ఇప్పటికే దాదాపు రెడీగా వున్న ఈ సినిమాలోని పాటలకు యూట్యూబ్ లో మిలియ‌న్ల సంఖ్య‌లో వ్యూస్ రాబ‌డుతూ..నాగ‌శౌర్య ప్ర‌స్తుతం ఫ‌లానా అబ్బాయి ఫ‌లానా అమ్మాయి, నారి నారి న‌డుమ మురారి, పోలీస్ వారి హెచ్చ‌రిక సినిమాలు చేస్తున్నాడు. మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ కంపోజ్ చేసిన పాట‌ల‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. ఈ సినిమాకు నిర్మాత ఉష మాల్పూరి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?