సినీ సెలబ్రిటీలు తమ రక్షణ కోసం సొంత బారీగార్డులను నియమించుకుంటుంటారు. బాడీ గార్డ్స్ అప్రమత్తంగా ఉంటూనే సెలబ్రిటీలు సురక్షితంగా ఉంటారు. అందుకే బాడీగార్డ్స్ మనసు నొచ్చుకోకుండా వాళ్లకు కావాల్సిన అన్ని సౌకర్యాలను సినీ సెలబ్రిటీలు కల్పిస్తుంటారు.
బాడీగార్డ్స్ లేనిదే సినీ సెలబ్రిటీలు ఇంటి నుంచి బయటకు కాలు పెట్టరు. సినిమా ఫంక్షన్స్, పబ్లిక్ మీటింగ్స్, షికార్లు.. ఇలా ఎక్కడికి వెళ్లినా సరే వీరు వారి వెంట ఉండాల్సిందే. చివరికి వారి నీడలేకపోయినా చూసుకోరేమో గానీ, బాడీగార్డ్స్ విషయంలో సినీ సెలబ్రిటీలు చాలా జాగ్రత్తగా ఉంటారు.
బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొణెకు కూడా ఓ బాడీగార్డ్ ఉన్నాడు. అతని జీతం గురించి తెలిస్తే ఆశ్చర్యంతో నోట మాట రాదంటే అతిశయోక్తి కాదు. దీపికా పదుకొణె జీతం అక్షరాలా కోటి రూపాయలు. ఈ మాట వినగానే వామ్మో అని ఆశ్చర్యపోతున్నారు కదూ!
దీపికా పదుకొణె వ్యక్తిగత సంరక్షకుడి పేరు జలాల్. ఎన్నో సంవత్సరాల నుంచి దీపికను కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. దీపిక బయటకి వచ్చిందంటే ఆమె వెనుకే నీడలా ఉంటాడు. దీపిక నటించిన హాలీవుడ్ సినిమా ‘ట్రిపుల్ ఎక్స్’ సినిమా ప్రమోషన్ సమయంలో జలాల్ ఫొటోలు బయటకు వచ్చాయి. తనని అంతగా సంరక్షిస్తున్న జలాల్‌ను దీపిక ఓ సోదరుడిలా చూసుకుంటారు.
ప్రతి ఏటా రాఖీ కడతారు. 2017 ముందు వరకూ జలాల్ ఏడాది జీతం రూ.80లక్షలు. తాజా సమాచారం ప్రకారం దీపిక అతని జీతాన్ని పెంచారు. పెంచిన జీతం నేపథ్యంలో ప్రస్తుతం దీపిక బాడీగార్డ్ వార్షిక జీతం రూ.కోటి. ఈ విషయం తెలిసి చాలా మంది షాక్‌కు గురి అవుతున్నారు. 24 గంటలూ పనిచేసినా ఎదుగు బొదుగూ లేని ఉద్యోగాల కంటే దీపిక బాడీగార్డ్‌గా ఒక ఏడాది పనిచేసినా చాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.