సినిమాలో తీసేసిన సాంగ్ ను మళ్లీ కలిపారు

భగవంత్ కేసరి సినిమా నుంచి ఓ ఫుల్ లెంగ్త్ పాటను తీసేసిన సంగతి తెలిసిందే. కథకు అడ్డొస్తుందని ఆ పాటను కట్ చేశాడు దర్శకుడు అనీల్ రావిపూడి. ఇప్పుడా సాంగ్ ను తిరిగి యాడ్…

భగవంత్ కేసరి సినిమా నుంచి ఓ ఫుల్ లెంగ్త్ పాటను తీసేసిన సంగతి తెలిసిందే. కథకు అడ్డొస్తుందని ఆ పాటను కట్ చేశాడు దర్శకుడు అనీల్ రావిపూడి. ఇప్పుడా సాంగ్ ను తిరిగి యాడ్ చేస్తున్నారు. ఇది చాలా స్పెషల్ సాంగ్ అంటున్నారు.

నిజానికి ఈ పాట నిడివి నాలుగున్నర నిమిషాలు. సాంగ్ మొత్తం షూట్ చేసి కథకు అడ్డొస్తుందని తీసేశారు. ఇంతకీ ఈ పాటలో స్పెషాలిటీ ఏంటంటే.. ఇందులో బాలకృష్ణ, కాజల్, శ్రీలీల కలిసి డాన్స్ చేశారు. అంతకంటే స్పెషల్ ఏంటంటే.. పాట చివర్లో ఓ 90 సెకెన్ల పాటు దంచవే మేనత్త కూతురా సాంగ్ ను రీమిక్స్ చేశారు.

ఇప్పుడీ పాటను సినిమాకు జత చేస్తున్నారు. అయితే నాలుగున్నర నిమిషాల పాట మొత్తం రావడం లేదు. కేవలం చివర్లో రీమిక్స్ చేసిన ఆ దంచవే మేనత్త కూతురు బిట్ ను మాత్రం యాడ్ చేస్తున్నారు. అది కూడా సినిమా మధ్యలో రావడం లేదు. రోలింగ్ టైటిల్స్ లో పెడుతున్నారు.

దాదాపు 50 మంది డాన్సర్లతో, భారీ సెట్ వేసి ఈ సాంగ్ షూట్ చేశారట. లక్షల్లో ఖర్చు చేశారట. అయినప్పటికీ కథకు అడ్డొచ్చిందని తీసేశారట. ఇప్పుడు కూడా కథలో భాగం చేయడం లేదు. చివర్లో వచ్చే రోలింగ్ టైటిల్స్ లో పెడుతున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.