ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ దేవర డేట్ వచ్చేసింది. అక్టోబర్ 10. దసరా టైమ్. ఈ సినిమా స్పీడ్ గా రెడీ అవుతుంటే బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ ఆరోగ్యం అన్నది స్పీడ్ బ్రేకర్ గా మారింది. దాంతో సినిమా ఆగింది. ఇక ఎప్పుడు వస్తుందన్నది క్లారిటీ లేక ఫ్యాన్స్ దిగాలు పడ్డారు
ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో విడుదల డేట్ వచ్చింది. దసరాకు అక్టోబర్ 10 విడుదల డేట్ గా అనౌన్స్ చేసారు. అసలే పెద్ద సినిమాల విడుదల డేట్ లు అన్నీ అబేయన్స్ లో వున్నాయి. ఆగస్ట్ 15 కి బన్నీ పుష్ప వస్తుందా రాదా అన్నది చిన్న అనుమానం. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సంగతి జ్యోతిష్కులకు కూడా తెలియదు. ప్రభాస్ కల్కి అన్న డేట్ కు వస్తుందనే అంటున్నారు. కానీ ఇంకా క్లారిటీ లేదు.
అందువల్ల ఈ సమ్మర్, దసరా వృధాగా పోతాయా అన్నది సినిమా లవర్స్ అనుమానం. ఇప్పుడు దేవర డేట్ వచ్చేసింది అక్టోబర్ 10 అంటూ. కానీ ఇన్ సైడ్ గ్యాసిప్ ఏమిటంటే పుష్ప రాకుంటే ఆగస్ట్ 15 కే దేవర వస్తుందని. లోలోపల ఆ ఏర్పాట్లే జరుగుతున్నాయి. కానీ పైకి మాత్రం అక్టోబర్ 10 ని డేట్ గా వేసారు.
సైఫ్ ఆలీఖాన్ కోసం చూస్తూ కూర్చోకుండా కాంబినేషన్ లేని సీన్లు అన్నీ చకచకా చేసేయాలని డిసైడ్ అయ్యారు. అవి ముందుగా చేసి రెడీ చేస్తే, మిగిలినవి లాస్ట్ మినిట్ లో చేసేయవచ్చు అన్నది దర్శకుడు కొరటాల శివ నిర్ణయం. ఇదంతా దేవర తొలిభాగం మాత్రమే. మలిభాగం ఇంకా వుండనే వుంది. అది వచ్చే ఏడాది సమ్మర్ కో, దసరా కో వస్తుందేమో?