ఏరి కోరి తెచ్చుకున్నారు సంగీత దర్శకుడు అనిరుధ్ ను దర్శకుడు కొరటాల శివ తను ఎన్టీఆర్ తో చేస్తున్న దేవర సినిమా కోసం. కానీ ఇప్పుడు ఆ సినిమాకు అదే శాపంగా మారిందని ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల బోగట్టా.
సకాలంలో ట్యూన్ లు ఇవ్వడకపోవడం అన్నది అతి పెద్ద సమస్య అని తెలుస్తోంది. నిజానికి అనిరుధ్ తో గతంలో సినిమాలు చేసిన వారు కూడా ఇదే కంప్లయింట్ చెబుతారు. పైగా ఫోన్ లకు ఆన్సర్ కూడా వుండదని అంటారు.
సరే, మొత్తానికి దేవర సినిమాకు కూడా అనిరుధ్ ట్రబుల్ ఇస్తున్నాడన్నది టాలీవుడ్ లో వినిపిస్తున్న సారాశం. సినిమాలో ఆయుధ పూజ సందర్భంగా వచ్చే పాట ఒకటి వుందట. ఆ పాటకు ట్యూన్ ఇవ్వక, కొన్నాళ్ల క్రితం వేసుకున్న షెడ్యూలు కూడా క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. ఆ షెడ్యూలు కోసం సైఫ్ ఆలీఖానీ బాలీవుడ్ నుంచి వచ్చి మళ్లీ వెనక్కు వెళ్లిపోవాల్సి వచ్చిందని, ఆ విధంగా డేట్ లు వృధా అయ్యాయని తెలుస్తోంది.
అనిరుధ్ ట్యూన్స్ ఇవ్వడం, రీరికార్డింగ్ చేయడం మీద సినిమా విడుదల తేదీ ఆధారపడి వుందని, అనుకున్న టైమ్ కు ఇస్తే అనుకున్న డేట్ కు వస్తుందని తెలుస్తోంది. అనిరుధ్ వర్క్ బాగుంటుంది. అందులో సందేహం లేదు. కానీ ఎంత వర్క్ బాగున్నా సినిమాను ఇన్ టైమ్ లో ఫినిష్ చేయడానికి సహకారం కూడా అవసరం కదా?