Advertisement

Advertisement


Home > Movies - Movie News

వీళ్లు ఫొటో రిలీజ్ చేస్తే.. వాళ్లు వీడియో లీక్ చేశారు

వీళ్లు ఫొటో రిలీజ్ చేస్తే.. వాళ్లు వీడియో లీక్ చేశారు

దేవర టీమ్ ఒకటి భావిస్తే, అక్కడ ఇంకోటి జరిగింది. ఈరోజు దేవర సినిమా నుంచి ఎన్టీఆర్ స్టిల్ ను విడుదల చేశారు. అది వర్కింగ్ స్టిల్. అందులో ఎన్టీఆర్ మాస్ లుక్ లో, భుజంపై టవల్ వేసుకొని కనిపిస్తున్నాడు. వెనక దర్శకుడు కొరటాల శివ, కొరియోగ్రాఫర్ రాజు సుందరం ఉన్నారు. 

రిలీజైన వెంటనే ఈ పిక్ బాగానే వైరల్ అయింది. అయితే ఊహించని విధంగా ఇదే ఫొటోకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో లీక్ అయింది. అదే డ్రెస్, సేమ్ గెటప్ లో ఎన్టీఆర్ సముద్రపు ఒడ్డున సీరియస్ గా నడుచుకుంటూ వెళ్తున్న వీడియోను ఎవ్వరో సోషల్ మీడియాలో లీక్ చేశారు. 

ప్రస్తుతం దేవర షూటింగ్ గోవాలో జరుగుతోంది. ఎన్టీఆర్ తో పాటు, మరికొంతమంది ఆర్టిస్టులపై సాగర తీరంలో ఓ మాంటేజ్ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. ఆ పాటకు రాజుసుందరం కొరియోగ్రఫీ చేస్తున్నాడు. ఔట్ డోర్ లొకేషన్ కావడంతో ఈజీగానే వీడియోలు బయటకొచ్చాయి. 

రెండు భాగాలుగా వస్తోంది దేవర సినిమా. కొరటాల డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమాతో జాన్వి కపూర్ సౌత్ కు పరిచయమౌతోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఏప్రిల్ చివరి నాటికి దేవర టాకీ పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అక్టోబర్ లో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. సైఫ్ అలీఖాన్ ఇందులో విలన్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?