ఎన్టీఆర్- కొరటాల శివ సినిమా విడుదల ఇక రెండు వారాల్లోకి వచ్చింది. ఈ సినిమా ట్రయిలర్ కు మిక్స్ డ్ టాక్ వచ్చింది. సినిమా ఎలా వున్నా, తెలుగునాట కలెక్షన్లు కుమ్మేస్తాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 300 కోట్ల గ్రాస్ వసూళ్లు రావాల్సి వుంది. అది వస్తుందా? రాదా? అన్నది సమస్య కాదు.
అలాగే తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్ల మీద ఏ మేరకు వస్తుంది అన్నది కూడా డిస్కషన్ కాదు. అసలు సినిమా హిందీ లో ఎలాంటి ఓపెనింగ్స్ తీసుకువస్తుంది. ఏ మేరకు వసూళ్లు వుంటాయి. అదే అసలు సిసలు సమస్య.
హిందీలో మంచి వసూళ్లు వస్తేనే ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా సెటిల్ కాగలుగుతాడు. లేదంటే చాలా అవమానంగా వుంటుంది. హిందీలో మాస్ మసాలా యాక్షన్ సినిమాలకు కలెక్షన్లు బాగానే వుంటాయి. కేవలం జాన్వికపూర్ మాత్రమే దేవర కు హుక్ పాయింట్ గా సరిపోతుందా? ఎన్టీఆర్ క్రేజ్ ఏ మేరకు వుండొచ్చు అన్నది దేవర సినిమా ఓపెనింగ్ డిసైడ్ చేస్తుంది. కలెక్షన్లు కుమ్మడం అన్నదానికి దేవర కంటెంట్ కీలకం అవుతుంది.
అందుకే ఎన్టీఆర్ అండ్ కో హిందీ మార్కెట్ మీదనే కీలకంగా దృష్టి పెట్టారు. సందీప్ వంగా తో ఇంటర్వూ, కరణ్ జోహార్ తో చిట్ చాట్, హిందీ నాటనే ట్రయిలర్ లాంచింగ్ ఇలా ఇవన్నీ అందుకోసమే. ఇంకా చాలా ప్రమోషన్ కంటెంట్ హిందీ మార్కెట్ కోసం ఎలాగూ వదులుతారు. ఇన్ని చేసిన తరువాత ఓపెనింగ్ బాగుండాలి. సినిమా బాగుంటే నడవడం అన్నది కానీ ఓపెనింగ్ అన్నది క్రేజ్ మీద, ఇప్పుడు దేవర ఈ విషయాలు అన్నీ రుజువు చేయబోతోంది.
ప్లాప్ అవుతుంది
మేము చూసేది థియేటర్లో కాదు ఓటిటిలో
Nuvvu pawala gadi cinimale choosthava
హిందీలో హిట్ కాకపోతే అవమానము? చిరు, RCT direct మూవీస్ చేసి debba తిన్నారు. So what?
Its an attempt ante.
chiru prathi bandh, aaj kaa goonda raaj hits brother…the gentle man kuda average fare..ika rc zanjeer maathram utterflop..rrr elagu super hit…ya devera hindi lo hit aina lekapoina no much difference for ntr he will try with another movie
Vinay garu. Ippati vallaki aci hits anu teliyadu. Pratibhandh ki film fare nomination kuda dorikindi. Vellu ch success ni eppudu oppukunnaru
Flop confirm