Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఈటీవీ పాలిట 'డెవిల్'

ఈటీవీ పాలిట 'డెవిల్'

ఈటీవీకి చుక్కలు చూపించింది కల్యాణ్ రామ్ హీరోగా నటించిన డెవిల్ సినిమా. భారీ రేటుకు కొనుగోలు చేసి, భారీగా ప్రచారం చేసి, ఘనంగా టెలికాస్ట్ చేసిన ఈ సినిమాకు అతి తక్కువ రేటింగ్ వచ్చింది. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ కల్యాణ్ రామ్ హీరోగా నటించిన డెవిల్ సినిమాకు, ఫస్ట్ టెలికాస్ట్ లో కేవలం 1.86 రేటింగ్ వచ్చింది.

మొదటిసారి ప్రసారం చేసినప్పుడు ఎంత ఫ్లాప్ సినిమాకైనా, ఎంతటి చిన్న సినిమాకైనా మినిమంలో మినిమం రేటింగ్ వస్తుంది. కానీ డెవిల్ సినిమా మాత్రం మొదటిసారికే బోల్తాకొట్టింది. ఈ సినిమా కంటే ఆల్రెడీ ప్రసారమైన సింహాద్రి, బిచ్చగాడు లాంటి సినిమాలకు.. రెండోసారి టెలికాస్ట్ అయిన మంగళవారం సినిమాకు మంచి రేటింగ్ వచ్చింది.

కల్యాణ్ రామ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కింది డెవిల్ సినిమా. ఈ సినిమాకు ప్రారంభంలో నిర్మాతగా వ్యవహరించిన అభిషేక్ నామా, ఆ తర్వాత దర్శకుడిగా కూడా కార్డు వేసుకున్నాడు. ఇలా అన్నీ తానై తెరకెక్కించిన ఈ సినిమా.. గతేడాది బాక్సాఫీస్ కు ఫినిషింగ్ టచ్ ఇస్తుందని అంతా భావించారు.

కానీ థియేటర్లలో ఈ సినిమా ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. కల్యాణ్ రామ్ స్టయిల్, దుస్తులు మాత్రమే ఆకట్టుకున్నాయి. ఇప్పుడు బుల్లితెరపై కూడా ఈ సినిమా డిజాస్టర్ అనిపించుకుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?