ధమ్కీ కోసం వెళ్తే మరోసారి ధమాకా చూపించారు

ధమ్కీ సినిమాలో ధమాకా ఛాయలు కనిపిస్తాయి. అలాఅని ఏకంగా ధమాకా సినిమానే మరోసారి చూపిస్తే ఎలా ఉంటుంది? విశాఖలో అదే జరిగింది. Advertisement ఈరోజు వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజైంది దాస్ కా…

ధమ్కీ సినిమాలో ధమాకా ఛాయలు కనిపిస్తాయి. అలాఅని ఏకంగా ధమాకా సినిమానే మరోసారి చూపిస్తే ఎలా ఉంటుంది? విశాఖలో అదే జరిగింది.

ఈరోజు వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజైంది దాస్ కా ధమ్కీ సినిమా. అన్నీతానై విశ్వస్ సేన్ తీసిన సినిమా ఇది. ఈ మూవీలో హీరోగా నటించడంతో పాటు.. దర్శకత్వం, స్క్రీన్ ప్లే, మాటలు, నిర్మాణ వ్యవహారాలు కూడా తనే చూసుకున్నాడు.

ఇలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించిన ధమ్కీ సినిమాను వైజాగ్ లోని సుకన్య థియేటర్ లో ప్రదర్శనకు సిద్ధం చేశారు. చాలామంది టికెట్లు కొనుక్కొని థియేటర్లలోకి వెళ్లారు. సినిమా స్టార్ట్ అయింది.. ధమ్కీ బదులు ధమాకా టైటిల్ పడింది.

దీంతో ఆడియన్స్ ఖంగుతిన్నారు. థియేటర్ లో గోలగోల చేశారు. అప్పటికిగానీ ప్రొజెక్టర్ ఆపరేటర్ కు తను చేసిన తప్పు తెలియలేదు. వెంటనే ప్రొజక్షన్ ఆపేశాడు. కొంచెం టైమ్ తీసుకొని థమ్కీ సినిమా వేశాడు.

ధమ్కీ, ధమాకా సినిమా టైటిల్స్ విషయంలో కన్ఫ్యూజన్ కు గురై ప్రొజెక్టర్ ఆపరేటర్ చేసిన తప్పిదం ఇది. ఆల్రెడీ ధమాకా సినిమా థియేటర్ల నుంచి వెళ్లిపోయి, ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ఇలాంటి టైమ్ లో ఆ సినిమాను మళ్లీ వేయడం అందర్నీ షాక్ కు గురిచేసింది.

విశ్వక్ సేన్ దర్శకత్వంలో తెరకెక్కింది ధమ్కీ సినిమా. నివేత పెతురాజ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో విశ్వక్, ద్విపాత్రాభినయం చేశాడు.