దిగి వచ్చిన బుక్ మై షో

నైజాం ఏరియాలో థియేటర్ యజ‌మానుల పంతం నెగ్గింది. బుక్ మై షో దిగి వచ్చింది. ప్రేక్షకుడి దగ్గర నుంచి టికెట్ రేట్ మీద అదనంగా వసూలు చేసే మొత్తం నుంచి థియేటర్ యజ‌మానులకు నేరుగా…

నైజాం ఏరియాలో థియేటర్ యజ‌మానుల పంతం నెగ్గింది. బుక్ మై షో దిగి వచ్చింది. ప్రేక్షకుడి దగ్గర నుంచి టికెట్ రేట్ మీద అదనంగా వసూలు చేసే మొత్తం నుంచి థియేటర్ యజ‌మానులకు నేరుగా వెనక్కు ఇచ్చే మొత్తాన్ని పెంచే విషయంలో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. 

టికెట్ రేటు మీద ఎనిమిది శాతాన్ని బుక్ మై షో వెనక్కు ఇవ్వడం పద్దతిగా వస్తొంది. 100 రూపాయల టికెట్ కు ఎనిమిది రూపాయలు వెనక్కు ఇస్తూ వస్తోంది. ఇది థియేటర్లకు అదనపు ఆదాయం.మామూలుగా టికెట్ అమ్మితే 100 వస్తుంది. బుక్ మై షో ద్వారా అమ్మితే 108 వస్తుంది.

అయితే ఇటీవల టికెట్ రేట్లు 250 కి పెరిగాయి. అప్పుడు ఇరవై రూపాయలు ఇవ్వాలన్నది థియేటర్ల వాదన. కానీ బుక్ మై షో అలా చేయకపోవడంతో ఆన్ లైన్ కు టికెట్ లు ఇవ్వడం ఆపేసారు. దీంతో అందరూ కూర్చుని మొత్తం మీద సెటిల్ చేసుకున్నారు. 

ఇప్పుడు 250 టికెట్ లేదా సింగిల్ స్క్రీన్ లకు 16 రూపాయలు ఇవ్వడానికి బుక్ మై షో ఓకె చేసింది. అంటే సింగిల్ స్క్రీన్ లో బుక్ మై షో ద్వారా టికెట్ అమ్మితే 266 రూపాయలు వస్తుందన్నమాట.

అలాగే మల్టీ ఫ్లెక్స్ ల్లో విక్రయిస్తే 21 రూపాయలు బుక్ మై షో ద్వారా వెనక్కు వెళ్తుంది. ఈ విధంగా చేయడం వల్ల బుక్ మై షో గతంలో ఇచ్చినట్లు ఎనిమిది శాతం కాకపోయినా ఆరు నుంచి ఏడు శాతం వెనక్కు ఇచ్చినట్లు అయింది.