దిల్ రాజు ప్లానింగ్ మామూలుగా వుండదు

టైమ్‌కు స్పందించి, సరైన నిర్ణయం తీసుకోవాలి. అలాంటి నిర్ణయం వచ్చేలా చేయాలి. అలాంటి వాళ్లకే పోటీలో చొటు వుంటుంది. దిల్ రాజు ఇలాంటి వాటికి ఫెర్ ఫెక్ట్ ఎగ్జాంపుల్.  Advertisement సలార్ సినిమా వాయిదా…

టైమ్‌కు స్పందించి, సరైన నిర్ణయం తీసుకోవాలి. అలాంటి నిర్ణయం వచ్చేలా చేయాలి. అలాంటి వాళ్లకే పోటీలో చొటు వుంటుంది. దిల్ రాజు ఇలాంటి వాటికి ఫెర్ ఫెక్ట్ ఎగ్జాంపుల్. 

సలార్ సినిమా వాయిదా అన్న విషయం తెలియగానే దిల్ రాజు పావులు కదపడం ప్రారంభించేసారు. రెండో వారంలో విడుదల వున్న రామ్-బోయపాటి సినిమా స్కంద ఆ డేట్ కు పంపేందుకు ప్లాన్ షురూ చేసారు. దీని వల్ల చాలా ప్రయోజనాలు వున్నాయి ఆయనకు.

స్కంద తో పాటు విడుదల అవుతున్న చంద్రముఖి 2 ఆయన పంపిణీ సినిమానే. ఇప్పుడు దానికి సోలో డేట్ దొరుకుతుంది. స్కంద కూడా ఆయన సినిమానే. దాంతో పాటు కలిపి తీసుకున్న కస్టడీ దెబ్బ కొట్టడంతో దీని మీద గట్టి భారం పడింది. ఇప్పుడు ఆ సినిమాను సలార్ డేట్ కు పంపడం వల్ల మంచి కలెక్షన్లు కళ్ల చూడొచ్చు. పైగా స్కంద సినిమా వైజాగ్ కూడా దిల్ రాజు తీసుకునే ఆలోచనలో వున్నారు.

టైగర్ నాగేశ్వరరావు దిల్ రాజు సినిమా కాదు. అందువల్ల అది ముందుకు రావడం ఆయనకు పెద్దగా ప్రయోజనం కలిగించే విషయం కాదు. మహా అయితే ఆయనే పంపిణీ చేసే భగవత్ కేసరికి కాస్త రిలీఫ్. అదంతా వచ్చేనెల సంగతి. అప్పటి ప్లానింగ్ అప్పుడు చూసుకోవచ్చు. ముందుకు ఈ నెల సినిమాల ప్లానింగ్ పెర్ ఫెక్ట్ గా వుండాలి కదా. అదీ సంగతి.