Advertisement

Advertisement


Home > Movies - Movie News

దిల్ రాజు…ఇది రెండో సారి

దిల్ రాజు…ఇది రెండో సారి

టాలీవుడ్ లో తనే సద్దులు చెబుతూ, తనే వాటిని ఉల్లంఘించే విషయంలో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ దిల్ రాజు మరోసారి అభాసుపాలయ్యారు. ఇవ్వాళ సినిమా ఇండస్ట్రీ జనాలు అంతా దిల్ రాజు గురించే మాట్లాడుకుంటున్నారు. 

సినిమా ఇండస్ట్రీ డిస్ట్రిబ్యూషన్ సర్కిళ్ల వాట్సాప్ గ్రూపులు అన్నీ ఇలాంటి సమాచారంతోనే నిండుతున్నాయి. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అంటూ పెట్టి, కొందరిని కౌన్సిల్ నుంచి పక్కకు జరిపి సమావేశాలు జరపింది ఆయనే. సరే, తదనుగుణంగా ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు అది కాస్తా షూటింగ్ లు బంద్ వరకు వచ్చింది.

కానీ గిల్డ్ పెద్ద అయిన దిల్ రాజునే ఓ కుంటి సాకు చెప్పి, తన సినిమా నిర్మాణం తాను చేసుకుంటున్నారు. గతంలో కూడా పాండమిక్ టైమ్ లో దిల్ రాజు ఇలాగే చేసారు. పాండమిక్ టైమ్ లో సినిమాలు ఓటిటి కి ఇవ్వకుండా కొన్నాళ్లు వేచి వుండాలని అందరూ అనుకుంటున్న టైమ్ లో, స్వయంగా ఎగ్జిబిటర్ అయిన దిల్ రాజు తన ‘వి’ సినిమాను ఓటిటి లో నేరుగా విడుదల చేసారు. అప్పుడు కూడా ఇలాగే విమర్శలు గట్టిగా వినిపించాయి.

సినిమాల విడుదల డేట్ లను డిసైడ్ చేయడం, తన సినిమాలకు సోలో డేట్ లు తెచ్చుకోవడం మీద ఇప్పటికే ఆయన మీద విమర్శలు వున్నాయి. కానీ నైజాంలో ఆయన సహకారం లేకుండా సినిమా విడుదల చేయడం కష్టం కనుక, అందరూ ఆఫ్ ది రికార్డుగా మాట్లాడడమే తప్ప ఆన్ రికార్డుగా ఎవ్వరూ ఏమీ అనరు. కానీ నిన్నటికి నిన్న సోషల్ మీడియాలో కూడా దిల్ రాజు మీద నెగిటివ్ కామెంట్లు గట్టిగా కనిపించాయి.

దీంతో నిన్న పొద్దు పోయిన తరువాత పేరు, ఊరు లేకుండా, ఎవరు విడుదల చేసారన్నది లేకుండా, తన వారసుడు సినిమాను తెలుగు సినిమాగా చూడవద్దని, తమిళ సినిమాగానే చూడాలని దిల్ రాజు కోరుతున్నారంటూ వాట్సాప్ గ్రూప్ ల్లో పోస్టింగ్ లు వేయించారు. తనకు తెలిసిన మీడియా జనాలను రిక్వెస్ట్ చేసి ఈ పోస్ట్ వేయించినట్లు తెలుస్తోంది.

మొదటి నుంచీ తెలుగు సినిమా నిర్మాణాలు అని ఎక్కడా అనలేదు. తెలుగు సినిమా నిర్మాతలు తన నిర్మాణాలు ఆపాలని అంటూ వచ్చారు. కానీ ఇప్పుడు కొత్తగా తెలుగు సినిమాల నిర్మాణాలు అంటూ నాలుక మడతేయడం పై సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్లు గట్టిగా కనిపిస్తున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?