రాధేశ్యామ్ లో అతి కష్టమైన పార్ట్ అదేనంట

రాధేశ్యామ్ షూటింగ్ టైమ్ లో యూనిట్ అంతా చాలా కష్టాలు పడింది. రెండు దశల కరోనాను దాటుకొని షూటింగ్ చేసింది. కరోనా టైమ్ లో విదేశాల్లో చిక్కుకుపోయింది. ఇన్ని కష్టాల మధ్య షూటింగ్ పూర్తిచేసుకున్న…

రాధేశ్యామ్ షూటింగ్ టైమ్ లో యూనిట్ అంతా చాలా కష్టాలు పడింది. రెండు దశల కరోనాను దాటుకొని షూటింగ్ చేసింది. కరోనా టైమ్ లో విదేశాల్లో చిక్కుకుపోయింది. ఇన్ని కష్టాల మధ్య షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు సంబంధించి మరో కష్టాన్ని బయటపెట్టాడు దర్శకుడు రాధాకృష్ణ కుమార్. సినిమా మొత్తంలో చాలా కష్టమైన పార్ట్ క్లైమాక్స్ అంటున్నాడు.

అవును.. రాధేశ్యామ్ క్లైమాక్స్ పార్ట్ షూటింగ్ కోసం చాలా కష్టపడిందట యూనిట్. ప్రస్తుతం మనం ట్రయిలర్, టీజర్, పోస్టర్లలో చూస్తున్న షిప్ ఎపిసోడ్ క్లైమాక్స్ లోనే వస్తుందట. ఆ ఎపిసోడ్ షూట్ చేయడం కోసం చాలా కష్టపడ్డామని తెలిపాడు దర్శకుడు. సినిమా మొత్తం ఒక ఎత్తయితే, ఆ ఒక్క పార్ట్ మరో ఎత్తు అంటున్నాడు.

రాధేశ్యామ్ సినిమా మొత్తానికి ఏడాదిన్నర పాటు ప్రీ-ప్రొడక్షన్ వర్క్ నడిస్తే, కేవలం క్లైమాక్స్ పార్ట్ కోసమే దాదాపు 5 నెలలు ప్రీ ప్రొడక్షన్ చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు డైరక్టర్. సినిమా మొత్తం మీద తనకు ఇష్టమైన ఎపిసోడ్ క్లైమాక్స్ మాత్రమేనని అంటున్నాడు.

మరోవైపు టైటానికి సినిమాకు, రాధేశ్యామ్ కు సంబంధం లేదనే విషయాన్ని కూడా చెప్పుకొచ్చాడు రాధాకృష్ణ. రాధేశ్యామ్ సినిమాలో కేవలం క్లైమాక్స్ లో మాత్రమే షిప్ కనిపిస్తుందని క్లారిటీ ఇచ్చాడు. విధిని ఎదిరింది, విక్రమాదిత్య తన ప్రేమను పొందాడా లేదా అనే విషయం క్లైమాక్స్ లో తెలుస్తుందని అంటున్నాడు.

ఈనెల 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తోంది రాధేశ్యామ్. ప్రభాస్-పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన ఈ భారీ బడ్జెట్ సినిమాకు తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.