తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇద్దరు కూతుళ్లూ విడాకుల ప్రకటన చేశారు. దాదాపు ఐదేళ్ల కిందట సూపర్ స్టార్ రజనీ కూతురు సౌందర్య విడాకుల ప్రకటన చేసింది. ఒక వ్యాపార ప్రముఖుడితో సౌందర్య ముందుగా వివాహం అయ్యింది. వారికి ఒక బాబు కూడా కలిగాడు. అయితే వారి వివాహబంధం ఆ తర్వాత కొంతకాలానికి ముగిసింది.
అశ్విన్ అనే అతడితో విడాకుల అనంతరం సౌందర్య మరో పెళ్లి కూడా చేసుకుంది. మూడేళ్ల కిందట ఆమె రెండో పెళ్లి చేసుకుని లైఫ్ లీడ్ చేస్తోంది. ఇక ధనుష్, ఐశ్వర్యల విషయంలో రకరకాల రూమర్లు మొదటి నుంచి వస్తూనే వచ్చాయి. అయితే వీరి వివాహబంధం 18 యేళ్ల పాటు కొనసాగింది. చివరకు వీరూ విడాకుల ప్రకటన చేశారు.
ఇలా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇద్దరి కూతుళ్ల జీవితంలోనూ విడాకులు సంభవించాయి. మరి సౌందర్య రీతిన ఐశ్వర్య మరో వివాహం వైపు సాగుతుందో, మరే నిర్ణయం తీసుకుంటోందో!
సినిమా వాళ్లు తెరపై చాలా భావోద్వేగమైన పాత్రలు చేస్తూ ఉంటారు. అయితే సినీ స్టార్ల జీవితాలు ప్రాక్టికల్ గా వేరేగా ఉంటాయి. ప్రత్యేకించి బంధాలను తెంచుకోవడం తెరపై చాలా కష్టమైన పని. ఈ ఘట్టాలను చాలా భావోద్వేగాల మిళితంగా చూపుతూ ఉంటారు. అయితే వాస్తవంలో మాత్రం అంత సీన్ ఉండదని.. అనేక మంది సినిమా వాళ్ల జీవితాలే సందేశం ఇస్తూ ఉంటాయి. తాము చాలా ఫ్రెండ్లీగా విడిపోతున్నట్టుగా వీరు చేసే ప్రకటనలోని లోతెంతో సామాన్యులకు అర్థం కాదు!