ప్రముఖ సింగర్, మీటూ ఉద్యమకారిణి చిన్మయి కేవలం గాయకురాలిగా కాకుండా, హక్కుల కార్యకర్తగా కూడా ప్రత్యేక గుర్తింపు పొందారు. వివిధ అంశాలపై తనవైన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం ఆమె ప్రత్యేకత.
ఎవరి మెప్పుకోసమే మనసులో మాటను దాచుకోవడం ఆమెకు అసలు ఇష్టం ఉండదు. ఎదుటి వాళ్ల అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా తన అభిప్రాయాల్ని సూటిగా చెప్పడం ఆమెకు ఒక్కోసారి ఇబ్బందులు తెచ్చి పెడుతోంది. అయినప్పటికీ ఆమె ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.
ఈ నేపథ్యంలో మరోసారి ఆమె వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. కొంత కాలంగా తన ప్రిగ్నెన్సీ రూమర్స్‌పై ఆమె సీరియస్‌గా స్పందించారు. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ షేర్ చేసి స్పష్టత ఇచ్చారు.
“ఇది మా పెళ్లి ఫొటో. మడిసార్ ధరించాను. మడిసార్ వల్ల నా పొట్ట పెద్దదిగా కనిపిస్తుంది. అంతే తప్ప నేను ప్రిగ్నెంట్ కాదు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు చూసి విసిగిపోయాను. నా పర్సనల్ లైఫ్ విషయాలు షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నా గురించి, సన్నిహితుల గురించి అస్సలు షేర్ చేయడం నాకు ఇష్టం ఉండదు. నేను ప్రిగ్నెంట్ అయినప్పుడు ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకోవచ్చు లేదా చేసుకోక పోవచ్చు. మేము వంద శాతం మా పిల్లల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయను. వారు ఎలాగు సోషల్ మీడియాలో ఉండరు” అని చిన్మయి పేర్కొన్నారు.
చిన్మయి స్వభావం తెలిసిన వారెవరికైనా ఆమె నుంచి ఇలాంటి పోస్ట్ రావడం ఆశ్చర్యం కలిగించదు. ఎందుకంటే వర్తమానం కాలం కంటే ఆమె ఆలోచనలు చాలా ఏళ్లు ముందుకు ప్రయాణించాయని అర్థం చేసుకోవాలి.