ఈగిల్ క్లారిటీ.. హనుమాన్..?

సంక్రాంతి సినిమాల్లో రెండు మూడు అన్ని విధాలా రెడీ అవుతున్నాయి. గుంటూరు కారం, సైంధవ్, ఫ్యామిలీ స్టార్ సంక్రాంతి విడుదలకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. కానీ నిజానికి వాటి కన్నా ముందుగా అన్నీ పూర్తి చేసుకుని…

సంక్రాంతి సినిమాల్లో రెండు మూడు అన్ని విధాలా రెడీ అవుతున్నాయి. గుంటూరు కారం, సైంధవ్, ఫ్యామిలీ స్టార్ సంక్రాంతి విడుదలకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. కానీ నిజానికి వాటి కన్నా ముందుగా అన్నీ పూర్తి చేసుకుని కాపీ రెడీగా వుంచుకున్న సినిమాలు రెండు వున్నాయి. హనుమాన్, ఈగిల్. ఈ రెండూ కూడా సంక్రాంతికే డేట్ లు ఇచ్చాయి కానీ వస్తాయా? అన్న అనుమానాలు వున్నాయి.

ఈ రోజు ఈగిల్ నుంచి మరోసారి క్లారిటీ వచ్చింది. రవితేజ టైగర్ నాగేశ్వరరావు ఫంక్షన్ లో ఈగిల్ మేకర్లు మరోసారి ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. దసరాకు టైగర్ అయితే సంక్రాంతికి ఈగిల్ అంటూ ప్రకటించేసారు. అంటే సంక్రాంతి బరిలోకి నాలుగో సినిమా ఫిక్స్ అన్నమాటే.

ఇక హనుమాన్ సంగతి తేలాలి. హనుమాన్ పరిస్థితి ఎలా వుంది అంటే ఏం చేయాలో అర్థం కానంత. ఇన్ని సినిమాల మధ్య వస్తే, భారీ ఖర్చుతో కూడిన తమ సినిమా పరిస్థితి ఏమిటి అన్నది ఒక సమస్య. పోనీ జనవరి 26 కు వెళ్దాం అంటే బాలీవుడ్ లో డేట్ దొరకని పరిస్థితి. ఇక కాదూ అంటే ఫిబ్రవరికి వెళ్లిపోవాలి. 

ఇప్పటికే అనేకసార్లు ఇదిగో అదిగో అంటూ వెనక్కు జరుగుతూ వస్తోంది. టీజర్ తో వచ్చిన బజ్ జనం మరిచిపోయేలా వుంది. ట్రయిలర్ పడితే మళ్లీ లేస్తుంది. కానీ ఇంకా ఫిబ్రవరి మార్చి అంటూ వెళ్తే పరిస్థితి ఏమిటో తెలియదు.

దసరా సందర్బంగా హనుమాన్ పోస్టర్ వస్తోంది. ఆ పోస్టర్ లో విడుదల డేట్ మీద క్లారిటీ వస్తుందని తెలుస్తోంది. ఈ మేరకు హనుమాన్ నిర్మాతలు ఓ నిర్ణయం తీసుకుని అనౌన్స్ చేసే అవకాశం వుంది.