ఈ గ్యాంగ్ కు లీడర్ విక్రమ్ నే

రివెంజ్ డ్రామా అన్నది పక్కా థ్రిల్లింగ్ యాక్షన్ జోనర్. దాన్ని ఫన్ జోనర్ లోకి మార్చడం అన్నది అంత సులువుకాదు. రివెంజ్ డ్రామాను ఫన్ జోనర్ లోకి మార్చితే అల్లరినరేష్ సినిమాగా మారిపోయే ప్రమాదం…

రివెంజ్ డ్రామా అన్నది పక్కా థ్రిల్లింగ్ యాక్షన్ జోనర్. దాన్ని ఫన్ జోనర్ లోకి మార్చడం అన్నది అంత సులువుకాదు. రివెంజ్ డ్రామాను ఫన్ జోనర్ లోకి మార్చితే అల్లరినరేష్ సినిమాగా మారిపోయే ప్రమాదం వుంది. ఇలాంటి టఫ్ ఫీట్ ను పెర్ ఫెక్ట్ గా చేస్తున్నట్లు కనిపిస్తోంది దర్శకుడు విక్రమ్ కే కుమార్. నాచురల్ స్టార్ నానితో విక్రమ్ కుమార్ చేస్తున్న 'గ్యాంగ్ లీడర్' సినిమా టీజర్ విడుదల చేసారు.

టీజర్ ఇన్ స్టాంట్ గా ఆకట్టుకునేలా కట్ చేసారు. ఇప్పటికే గ్యాంగ్ లీడర్ లైన్ బయటకు వచ్చింది. అయిదుగురు మహిళలు, ఒక రచయిత, వీళ్ల రివెంజ్ అన్నది టీజర్ లో క్లియర్ గా చెప్పారు. పెన్సిల్ పార్థసారథిగా నాని టీజర్ లో కనిపించాడు. లక్ష్మి, శరణ్య తదితరులు టీజర్ లో గ్యాంగ్ లో భాగంగా కనిపించారు. విలన్ గా నటిస్తున్న హీరో కార్తికేయను జస్ట్ ఎట్ ఎ గ్లాన్స్, సైడ్ యాంగిల్ లో చూపించారు.

టీజర్ కు అనిరుధ్ ఇచ్చిన బ్యాక్ గ్రవుండ్ స్కోర్ బాగుంది. నాని స్టయిల్ ఫన్ ను దర్శకుడు విక్రమ్ పక్కాగా జనరేట్ చేసినట్లు కనిపిస్తోంది. సినిమాలో థీమ్ సాంగ్ అయిన 'రారా జగతిని జయించుదాం' అన్నది టీజర్ లో కూడా కట్ చేసారు. మొత్తంమీద సినిమా మీద కాస్త ఆసక్తి రేకెత్తించడంలో టీజర్ సక్సెస్ అయినట్లే.

దేవరకొండ గురించి రష్మిక చెప్పిన ముచ్చట్లు

నటుడి కంటె నాయకుడికే ఎక్కువ కష్టం