ఈసారైనా బన్నీ మాట మీద వుంటారా?

హిట్ కొట్టిన దర్శకుడు వుంటే చాలు పిలిచి, మాంచి కథ వుంటే చెప్పు సినిమా చేద్దాం అని ఓ మాట వేసి వుంచడం అన్నది హీరోలకు చాలా కామన్. బన్నీ కూడా దీనికి అతీతమేమీ…

హిట్ కొట్టిన దర్శకుడు వుంటే చాలు పిలిచి, మాంచి కథ వుంటే చెప్పు సినిమా చేద్దాం అని ఓ మాట వేసి వుంచడం అన్నది హీరోలకు చాలా కామన్. బన్నీ కూడా దీనికి అతీతమేమీ కాదు. అధికారికంగా కాకున్నా, అనౌన్స్ చేయకున్నా బన్నీ ఇలా ఓ మాట వేసి వుంచిన డైరక్టర్లు చాలా మందే వున్నారు. వారి సంగతి పక్కన పెడితే వేణు శ్రీరామ్ ఐకాన్ సినిమాకు అధికారికంగానే మాట ఇచ్చాడు. చాలా రోజుల ఐకాన్ లేబుల్ వున్న టోపీ పెట్టుకుని కనిపించేవాడు. కానీ మరి ఏమయిందో ఆ ప్రాజెక్టు పక్కన పెట్టేసారు.

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్నా అంటూ హడావుడి చేసారు బన్నీ. అక్కడకు వెళ్లి చిన్న హడావుడి చేసారు. త్వరలో సినిమా అన్నారు. అంతా అయింది. కానీ ఆ తరువాత చాలా కన్వీనియెంట్ గా దానిని మరిచిపోయారు. ఆ తరువాత మరి దాని ఊసే లేదు.

బోయపాటి తరువాత సినిమా మాదే..బన్నీ తో అని స్టేజ్ మీదే ప్రకటించారు అల్లు అరవింద్. కానీ ఎందుకనో అదీ సెట్ కావడం లేదు.

సురేందర్ రెడ్డి, హరీష్ శంకర్, మురుగదాస్ ల పేర్లు అధికారికంగా అయి వినిపించలేదు కానీ బలమైన గ్యాసిప్ లే వచ్చాయి. వక్కంతం వంశీ కొన్నాళ్ల పాటు బన్నీ దగ్గరే వుండి కధల డిపార్ట్ మెంట్ వ్యవహారాలు కూడా చూసారు.

లేటేస్ట్ గా సందీప్ వంగా పేరు ఫైనల్ అయింది. అర్జున్ రెడ్డి రెండు భాషల్లో తీసిన అనుభవం తో ఏనిమల్ సినిమా చేస్తున్నారు. దీని ఫలితం బట్టే బన్నీ సినిమా వుంటుందని, ప్రస్తుతానికి ప్రకటించినా పక్కాగా వుండాలని లేదని గత సంఘటనలను బట్టి సినిమా జనాలు కామెంట్ చేస్తున్నారు.