ఎన్నికలు – టాలీవుడ్ దారి ఎటు?

తెలంగాణలో ఎన్నికల మూడ్ ఫుల్‌గా అలుముకుంది. 2019లోనూ హోరాహోరీగా ఎన్నికలు జరిగాయి. అప్పుడు కూడా మహాకూటమి అంటూ ఏర్పడి, తెరాసను కార్నర్ చేసే ప్రయత్నం జరిగింది. ఇప్పుడు అలా కూటమి అంటూ లేకపోయినా కాంగ్రెస్…

తెలంగాణలో ఎన్నికల మూడ్ ఫుల్‌గా అలుముకుంది. 2019లోనూ హోరాహోరీగా ఎన్నికలు జరిగాయి. అప్పుడు కూడా మహాకూటమి అంటూ ఏర్పడి, తెరాసను కార్నర్ చేసే ప్రయత్నం జరిగింది. ఇప్పుడు అలా కూటమి అంటూ లేకపోయినా కాంగ్రెస్ కు తెలుగుదేశం పార్టీ పరోక్షంగా సహయ సహకారాలు అందిస్తోందన్న వార్తలు వున్నాయి. 

ఇలాంటి నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ జనాలు ఏం ఆలోచిస్తున్నారు అన్నది పాయింట్. టాలీవుడ్ ఎక్కువగా సెటిలర్లతో నిండి వుంది. అయితే తెలంగాణ వచ్చిన తరువాత ఇక్కడ జనాలు చాలా ఎక్కువగా అకామిడేట్ అయ్యారు. అందువల్ల టాలీవుడ్ అంటే ఇప్పుడు కేంద్రం సెటిలర్స్ మాత్రమే కాదు, కానీ కీలక వ్యక్తులు, సెలబ్రిటీలు మాత్రం ఎక్కువగా సెటిలర్లే. అందువల్ల వీళ్ల మద్దతు ఎటు అన్నది ఆసక్తికరంగా మారింది.

ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రముఖుడు ఒకరు టాలీవుడ్ జనాలు కొందరితో సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ కు చెందిన పలువురు ఈ సమావేశంలో పాల్గొన్నారని తెలుస్తోంది. గత పదేళ్లుగా టీఆర్ఎస్/బీఆర్ఎస్ ప్రభుత్వం ఇండస్ట్రీతో ఎంత స్నేహపూర్వకంగా వున్నది, ఏం కావాలన్నా ఎలా అనుమతులు ఇస్తున్నదీ వివరించి, ఈ సారి కూడా మద్దతు ఇవ్వాలని ఆ నేత కోరినట్లు తెలుస్తోంది. 

దానికి టాలీవుడ్ జనాలు అంతా దాదాపు పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. అంతకన్నా ఏమంటారు? అయితే ఒకరిద్దరు మాత్రం వేరే వాళ్లు కూడా ఇలాగే అడుగుతారు కదా, సెటిలర్లు వేరే విధంగా ఆలోచిస్తున్నారు అనే విషయాలు ఆ నేత దృష్టికి తెచ్చినట్లు తెలుస్తోంది. 

మొత్తం మీద జస్ట్ ఫార్మల్ గా ఈ సమావేశం ముగిసింది. మరి కాంగ్రెస్ తో సమావేశం ఎప్పుడు వుంటుందో?