ఎన్నాళ్లకెన్నాళ్లకు…ఈ సందడి

2020 జ‌నవరి…సరిలేరు నీకెవ్వరు..అల వైకుంఠపురములో. రెండు పెద్ద సినిమాలు. పోటా పోటీ విడుదల..హడావుడి..ఇంతా అంతా కాదు. అంతలోనే కరోనా మహమ్మారి వచ్చి పడింది. ఆ సందడి మాయమైంది.  Advertisement కరోనా ఫస్ట్ ఫేజ్ తరువాత…

2020 జ‌నవరి…సరిలేరు నీకెవ్వరు..అల వైకుంఠపురములో. రెండు పెద్ద సినిమాలు. పోటా పోటీ విడుదల..హడావుడి..ఇంతా అంతా కాదు. అంతలోనే కరోనా మహమ్మారి వచ్చి పడింది. ఆ సందడి మాయమైంది. 

కరోనా ఫస్ట్ ఫేజ్ తరువాత మళ్లీ సినిమాలు వచ్చాయి. హిట్ లు, బ్లాక్ బస్టర్లు వచ్చాయి. కానీ అసలు సిసలైన ఆ సందడి మాత్రం లేదు. ఈ మధ్యనే బాలయ్య అఖండ వచ్చింది. హైదరాబాద్ మరి కొన్ని చోట్ల తెల్లవారుఝాము హడావుడి, టికెట్ ల కోసం డిమాండ్ కనిపించిది.

ఇప్పుడు పుష్ప సినిమా వస్తోంది. ఇప్పుడు మళ్లీ ఆ అసలు సిసలు హడావుడి కనిపిస్తోంది. థియేటర్ల మేనేజర్లు ఫోన్ లు స్విచాఫ్ చేసుకునే పరిస్థితి. అటు స్పైడర్ మాన్, ఇటు పుష్ప టికెట్ ల కోసం రికమెండేషన్లు, హడావుడి మామూలుగా లేదు. ఇటు సినిమా ఫ్యాన్స్, అటు బన్నీ ఫ్యాన్స్ సందడి ఓ లెవెల్ లో వుంది.

శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వరకు ఇదే హడావుడి. ఇదే సందడి. 150 కోట్ల మేరకు థియేటర్, నాన్ థియేటర్ మార్కెట్ చేసిన సినిమా. దాంతో జ‌నాలు ఎప్పుడు తెల్లారుతుందా? ఎప్పుడు థియేటర్ దగ్గర చేరి హంగామా చేద్దామా? చూద్దామా? అని తెగ ఉత్సాహంగా వున్నారు.

ఈ ఉత్సాహం ఇలాగే వుంటుంది. వరుసగా పెద్ద సినిమాలు అన్నీ కొలువు తీరుతున్నాయి మరి.