దసరా సందర్భంగా టాలీవుడ్ నుంచి అప్ డేట్ లు, ప్రకటనలు, లుక్ లు, ఓపెనింగ్ లు, హడావుడే హడావుడి. హారిక హాసిని లేదా దాని సిస్టర్ కన్సర్న్ సితార నుంచి కొత్త సినిమా ప్రకటన రాబోతోంది.
నాగ్ చైతన్య-దిల్ రాజు-విక్రమ్ కుమార్ ల సినిమా మొదలు కాబోతోంది. అఖిల్ బ్యాచులర్ సినిమా నుంచి కలర్ ఫుల్ ట్రయిలర్ వస్తుంది. రామ్ రెడ్ సినిమా విడుదల డేట్ ప్రకటన రాబోతోంది. రవితేజ ఖిలాడీ, క్రాక్ సినిమా పోస్టర్లు విడుదల చేస్తారు.
శర్వానంద్ తో కిషోర్ తిరుమల సినిమా తిరుపతిలో ప్రారంభం అవుతుంది. అలాగే నాని శ్యామ్ సింఘరాయ్ కొత్త నిర్మాణ సంస్థ తరపున పోస్టర్ వస్తుంది. ఈ సినిమా సితార ఎంటర్ టైన్ మెంట్స్ నుంచి వెంకట్ బోయినపల్లికి వెళ్లిన సంగతి తెలిసిందే.
ఇంకా మరికొన్ని సినిమాల ప్రకటనలు రాబోతున్నాయి. రేపు ఎన్ని ప్రకటనలు వచ్చినా, ఎన్ని ప్రారంభాలు వున్నా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రాబోతున్న అప్ డేట్ కు అన్నింటికన్నా ఎక్కువ క్రేజ్ వస్తుందని తెలుస్తోంది. పైగా ఈ ప్రకటన కూడా కాస్త వెరైటీగా వుంటుందని తెలుస్తోంది.