Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఎక్స్ క్లూజివ్-నాగ్ చైతన్య ‘కస్టడీ’

ఎక్స్ క్లూజివ్-నాగ్ చైతన్య ‘కస్టడీ’

దిల్ రాజు నిర్మించిన థాంక్యూ ను పక్కన పెడితే మిగిలిన లైనప్ అంతా మంచి పేరే తెచ్చింది యంగ్ హీరో నాగ్ చైతన్యకు. లవ్ స్టోరీ, మజిలీ లాంటి సినిమాలు చైతన్యను ప్రామిసింగ్ హీరోగా మార్చాయి. వైవిధ్యన థ్రిల్లర్లకు కాస్త ఎంటర్ టైన్ మెంట్ టచ్ ఇచ్చి తీసే దర్శకుడు వెంకట్ ప్రభు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో చిట్టూరి శ్రీను నిర్మిస్తున్న సినిమా ప్రస్తుతం సెట్ మీద వుంది.

కాస్త గ్యాప్ తరువాత చైతన్య చేస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ఇది. ఈ సినిమాకు టైటిల్ ‘కస్టడీ’ అని ఫిక్స్ చేసారు. సినిమా జానర్, సబ్జెక్ట్ ప్రకారం పక్కా యాప్ట్ టైటిల్ ఇది. చాలా స్పీడ్ గా రెడీ అవుతోందీ సినిమా. 

తెలుగు, తమిళ భాషల్లో రెడీ అవుతన్న ఈ సినిమాను కాస్త భారీగానే నిర్మిస్తున్నారు. యు టర్న్, వారియర్, అలాగే బోయపాటి-రామ్ సినిమాలతో నోటెడ్ నిర్మాతగా మారిన చిట్టూరి శ్రీను కాస్త గట్టి ఖర్చే చేస్తున్నారు.

బహుశా చైతన్య సినిమాల్లో కాస్త హై బడ్జెట్ సినిమా ఇదే కావచ్చు. ఈ సినిమాలో అరవింద్ స్వామి కీలకపాత్ర పోషిస్తున్నారు. యువన్ శంకర్ రాజా తెలుగులో చాలా కాలం తరువాత మళ్లీ సంగీతం అందిస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?