రష్మిక ఇంత హాట్ గా కనిపించిందేట్టబ్బా..!

ఉన్నట్టుండి సడెన్ గా ట్రెండింగ్ లోకి వచ్చింది రష్మిక. దీనికి కారణం ఆమెకు సంబంధించిన ఓ హాట్ వీడియో ఒకటి వైరల్ అవ్వడమే. ఇప్పటివరకు రష్మిక ఎప్పుడూ ఇంత హాట్ గా కనిపించలేదు. దీంతో…

ఉన్నట్టుండి సడెన్ గా ట్రెండింగ్ లోకి వచ్చింది రష్మిక. దీనికి కారణం ఆమెకు సంబంధించిన ఓ హాట్ వీడియో ఒకటి వైరల్ అవ్వడమే. ఇప్పటివరకు రష్మిక ఎప్పుడూ ఇంత హాట్ గా కనిపించలేదు. దీంతో చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరికొంతమంది అనుమానం వ్యక్తం చేశారు. వాళ్ల అనుమానమే నిజమైంది.

ప్రస్తుతం ట్విట్టర్, ఇనస్టాగ్రామ్ లో తెగ వైరల్ అవుతున్న సదరు వీడియో రష్మికది కాదు. ఎవరో మార్ఫింగ్ చేశారు. ఈ విషయాన్ని కొంతమంది సాక్ష్యాలతో సహా బయటపెట్టారు. 

ఏమాత్రం అనుమానం రాకుండా మార్ఫింగ్ చేసిన ఆ వీడియోలో ఉన్నది జారా పటేల్ అనే యువతి. ఆమె ముఖాన్ని తొలిగించి ఆ స్థానంలో రష్మిక ఫేస్ పెట్టి ఫేక్ వీడియో తయారుచేశారు. అస్సలు కనిబెట్టలేని విధంగా ఎడిట్ చేసిన ఈ వీడియోను చాలామంది ఖండించారు.

ఈ చర్చలోకి ఏకంగా బిగ్ బి చేరడం విశేషం. సదరు ఫేక్ వీడియోను తయారుచేసిన వ్యక్తులపై లీగల్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై కేంద్ర ఐటీ శాఖ కూడా స్బందించింది. ఇలాంటి ఫేక్ వీడియోల్ని అత్యంత ప్రమాదకర చర్యగా పేర్కొన్న కేంద్ర మంత్రిత్వ శాఖ.. ఇలాంటి తప్పుడు చర్యలకు సోషల్ మీడియా వేదికలే బాధ్యత వహించాలని, తప్పు అని తెలిసిన వెంటనే 36 గంటల్లో తొలిగించాలని పేర్కొంది.

రష్మికకు దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఆమె నేషనల్ క్రష్. అలాంటి హీరోయిన్ పై ఇలా ఫేక్ వీడియో చేసి వైరల్ చేయడం చర్చనీయాంశమైంది. ఆమె ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. రష్మిక గ్లామరస్ గా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. కానీ మరీ ఇంత ఎక్స్ పోజింగ్ మాత్రం చేయదామె. సరిగ్గా అక్కడే నెటిజన్లకు అనుమానం వచ్చింది. తీగ లాగితే డొంక మొత్తం కదిలింది.