పూజా హెగ్డే బికినీ స్టిల్ కోసం ఫ్యాన్స్ డిమాండ్

ఫ్రీ టైమ్ దొరికితే విహారయాత్రకు వెళ్లాలని ఉందంటూ సెకెండ్ లాక్ డౌన్ నుంచి చెబుతోంది పూజాహెగ్డే. అయితే ఆ టైమ్ ఆమెకు అంత ఈజీగా దొరకలేదు. అప్పటికే కమిట్ అయిన సినిమాల్ని ఆమె పూర్తిచేయాల్సి…

ఫ్రీ టైమ్ దొరికితే విహారయాత్రకు వెళ్లాలని ఉందంటూ సెకెండ్ లాక్ డౌన్ నుంచి చెబుతోంది పూజాహెగ్డే. అయితే ఆ టైమ్ ఆమెకు అంత ఈజీగా దొరకలేదు. అప్పటికే కమిట్ అయిన సినిమాల్ని ఆమె పూర్తిచేయాల్సి ఉంది. అలా లాక్ డౌన్ ముగిసిన తర్వాత వెంటనే సెట్స్ పైకొచ్చిన పూజా.. అన్ని పనులు పూర్తిచేసి, ఎట్టకేలకు తను కోరుకున్న విహార యాత్రను షురూ చేసింది.

మాల్దీవుల్లో ల్యాండ్ అయింది ఈ బ్యూటీ. అందమైన, ఖరీదైన రిసార్ట్ లో అడుగుపెట్టింది. దీవుల్లో అడుగు పెట్టినప్పట్నుంచి ఏ ఒక్క మూమెంట్ ను మిస్ అవ్వకుండా, అన్ని వీడియోస్ ను పోస్ట్ చేస్తోంది. అలా కొన్ని రోజులు మాల్దీవుల్లో సేదతీరి తిరిగి షూటింగ్స్ లో జాయిన్ అవ్వబోతోంది ఈ బుట్టబొమ్మ.

రీసెంట్ గా రకుల్, జాన్వికపూర్, సారా అలీఖాన్, దిశా పటానీ, కాజల్ లాంటి తారలు మాల్దీవుల్లో ఎంజాయ్ చేశారు. పనిలో పనిగా తమ బికినీ ఫొటోల్ని కూడా షేర్ చేశారు. మరి పూజాహెగ్డే తన బికినీ ఫొటోను ఎప్పుడు పెడుతుందా అంటూ సోషల్ మీడియాలో ఆమె ఫాలోవర్స్ ఎదురుచూస్తున్నారు. బికినీ స్టిల్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

పూజా హెగ్డే నటించిన ఆచార్య, రాధేశ్యామ్ సినిమాలు షూటింగ్స్ పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ 2 సినిమాలు 3 వారాల గ్యాప్ లో థియేటర్లలోకి రాబోతున్నాయి. విజయ్ సరసన ఆమె చేస్తున్న బీస్ట్ సినిమా షూటింగ్ మోడ్ లో ఉంది. దీంతో పాటు 2 బాలీవుడ్ సినిమాలు కూడా లిస్ట్ లో ఉన్నాయి.