టీజర్, ట్రయిలర్ తోనే సర్ ప్రైజ్ చేస్తున్న రోజులివి. పాత పద్ధతిలో, రొటీన్ గా టీజర్/ట్రయిలర్ కట్ చేస్తే ఈ కాలం కష్టం. టీజర్ తో ఉక్కిరిబిక్కిరి చేయాలి. ట్రయిలర్ తో ఆశ్చర్యానికి గురిచేయాలి. 'ఓడియమ్మా ఏంటీ ట్రయిలర్' అనిపించాలి. మరి సలార్ ట్రయిలర్ అలా ఉంటుందా?
కొన్ని రోజులు కిందట యానిమల్ ట్రయిలర్ వచ్చింది. ఆ ట్రయిలర్ గూస్ బంప్స్ తెప్పించింది. ఓపెనింగ్ షాట్ లోనే తండ్రి-కొడుకు మధ్య జరిగే సీన్ తో ట్రయిలర్ ఓపెన్ చేశారు. కథ ఏంటనే విషయాన్ని క్లియర్ గా చూపించారు. చివరికి క్లయిమాక్స్ షాట్స్ కూడా ట్రయిలర్ లో ఉన్నాయి. ట్రయిలర్ కట్ లో ఇదొక కొత్త ఎత్తుగడ.
దాదాపు అదే టైమ్ లో కాంతార చాప్టర్ 1 గ్లింప్స్ వచ్చింది. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఫస్ట్ లుక్ వీడియోలో కథ-క్యారెక్టర్ ను సింపుల్ గా ఎలివేట్ చేశారు. జస్ట్ నిమిషం నిడివి ఉన్న ఈ ఫస్ట్ లుక్ వీడియో అదిరింది. గతంలో వచ్చిన హను-మాన్ టీజర్ కూడా ఓ రేంజ్ లో ఉంది.
ఇలా టీజర్ లేదా ట్రయిలర్ ను కొత్తగా ప్రజెంట్ చేయాల్సిన సమయం వచ్చేసింది. సలార్ ట్రయిలర్ లో అలాంటి సర్ ప్రైజ్ ఎలిమెంట్ కోరుకుంటున్నారు ఫ్యాన్స్.
నిజానికి సలార్ టీజర్ అలానే ఉంది. చాలామందికి నచ్చింది. అయితే అందులో కేజీఎఫ్ ఛాయలు కూడా కనిపించాయనే కంప్లయింట్స్ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆర్ట్ వర్క్ విషయంలో కేజీఎఫ్ ను పోలిన సెట్స్ కనిపించాయి. హీరో ఎలివేషన్స్ తోనే ఆ టీజర్ ముగిసింది. ట్రయిలర్ లో మాత్రం అంతకుమించి కనిపించాలి, థ్రిల్ అందించాలి. అప్పుడే సలార్ పై అంచనాలు మరింత పెరుగుతాయి. ఈరోజు సాయంత్రం సలార్ ట్రయిలర్ రిలీజ్ అవుతుంది.