
పంజాబ్‌లోని భటిండా సెంట్రల్ జైలులో ఉన్న గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ మరోసారి వార్తల్లోకి వచ్చారు. జైలులో ఉండగానే ఇటీవలి ఓ మీడియా ఇంటరాక్షన్‌లో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను చంపడం తన జీవిత లక్ష్యమని బిష్ణోయ్ బెదిరించారు. సల్మాన్‌ఖాన్‌కు భద్రత తొలగిస్తే చంపేస్తామన్నారు.
బిష్ణోయ్ మాట్లాడుతూ.. సల్మాన్‌కి రావణుడి కంటే పెద్ద అహం ఉందని, కృష్ణజింకను చంపినందుకు ఖాన్ బిష్ణోయ్ వర్గానికి క్షమాపణ చెప్పిన తర్వాత మాత్రమే అతనికి హాని కలిగించకుండా తాను వెనక్కి తగ్గుతానని వెల్లడించాడు. బిష్ణోయ్ తెగకు చెందిన బికనీర్‌లోని గుడికి వెళ్లి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సల్మాన్ ఖాన్‌ను చంపాలని 4-5 సంవత్సరాలుగా ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించాడు.
కాగా 1998లో, సల్మాన్ ఖాన్ తన సినిమా 'హమ్ సాథ్ సాథ్ హై' షూటింగ్ లొకేషన్ దగ్గర కృష్ణజింకను వేటాడాడు. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం రక్షిత జాతి అయిన జంతువును చంపడం వల్ల జోధ్‌పూర్ కోర్టు సల్మాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఆయనకు బెయిల్ మంజూరైంది. కాగా ఈ గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్ తెగకు చెందినవాడు, వీరికి కృష్ణజింకలు పవిత్రమైనవి.
ఇప్పటికే డజన్ల కొద్దీ క్రిమినల్ కేసులులో నిందితుడుగా ఉన్న లారెన్స్ బిష్ణోయ్ పంజాబ్‌లోని భటిండా సెంట్రల్ జైలులో ఉన్నారు. ప్రముఖ సింగర్ సిద్ధూ మూస్ వాలా హత్య కేసులో కూడా నిందితుడుగా ఉన్నారు. తాజా వీడియోతో పోలీసులు మరోసారి అప్రమత్తం అయ్యారు.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా