విజయ్ దేవరకొండ.. మరో రీమేక్!

తను నటించింది తక్కువ సినిమాలే అయినా.. వాటితో పక్క భాషల వాళ్లను బాగా ఆకట్టుకుంటున్నట్టుగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. 'అర్జున్ రెడ్డి'తో సంచలన విజయాన్ని అందుకున్న ఈ హీరో ఆ సినిమాతోనే ఇతర భాషల…

తను నటించింది తక్కువ సినిమాలే అయినా.. వాటితో పక్క భాషల వాళ్లను బాగా ఆకట్టుకుంటున్నట్టుగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. 'అర్జున్ రెడ్డి'తో సంచలన విజయాన్ని అందుకున్న ఈ హీరో ఆ సినిమాతోనే ఇతర భాషల వాళ్ల మధ్యనా గుర్తింపు సొంతం చేసుకున్నాడు. అలాగే ఆ సినిమా హిందీలో రీమేక్ అయ్యి సంచలన విజయం సాధించింది. ఇంకా ఇతర భాషల రీమేక్ లూ సాగుతూ ఉన్నాయి.

ఆ తర్వాత 'నోటా'తో తమిళులకు డైరెక్టుగా పరిచయం అయ్యాడు. 'డియర్ కామ్రేడ్' ను ఐదు భాషల్లో విడుదల చేసినట్టున్నారు. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేసే ప్రతిపాదన ఉంది. ఆ సంగతలా ఉంటే.. ఈ హీరో నటించిన మరో సూపర్ హిట్ సినిమా 'గీతగోవిందం' హిందీలో రీమేక్ కాబోతోందని తెలుస్తోంది.

తెలుగులో ఆ సినిమా ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు వెర్షనే ఇతర భాషల వాళ్లనూ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా హిందీలో రీమేక్ కాబోతోందట. యాక్షన్ సినిమాల డైరెక్టర్, ప్రొడ్యూసర్ రోహిత్ షెట్టి ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నాడట. 'ధడక్' ఫేమ్ ఇషాన్ ఖట్టర్ హిందీ వెర్షన్లో హీరో గా నటించబోతున్నాడని సమాచారం.

 'చిరు పనైపోయినట్టే' అని నవ్విన నోళ్లు మూతబడేలా